తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​: సిక్సర్లలో మరో మైలురాయి దాటిన గేల్​

పంజాబ్​ కింగ్స్​ బ్యాట్స్​మన్​ క్రిస్​ గేల్.. ఐపీఎల్​లో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సిక్సర్లలో 350 మార్కును దాటాడు. ఇప్పటివరకు 351 బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. ఈ జాబితాలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు యూనివర్స్​ బాస్​.

Gayle, first batsman to hit 350 sixes in IPL
క్రిస్ గేల్​, ఐపీఎల్​లో 350 సిక్స్​లు

By

Published : Apr 13, 2021, 9:02 AM IST

విండీస్ విధ్వంసకర బ్యాట్స్​మన్​ క్రిస్​ గేల్​ ఐపీఎల్​లో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. లీగ్​ చరిత్రలో 350కిపైగా సిక్స్​లు కొట్టిన తొలి బ్యాట్స్​మన్​గా నిలిచాడు. రాజస్థాన్​తో మ్యాచ్​లో బెన్​ స్టోక్స్​ తొలి ఓవర్లో బంతిని స్టాండ్స్​లోకి పంపిన గేల్..​ ఈ ఫీట్​ సాధించాడు. మొత్తం గేల్​ 351 బంతులను సిక్సర్లుగా మలిచాడు.

గేల్​ దరిదాపుల్లో ఏ ఇతర క్రికెటర్​ లేడు. ఒక్క ఏబీ డివిలియర్స్​ మాత్రమే 237 సిక్స్​లతో అతని తర్వాతి స్థానంలో ఉన్నాడు.

విధ్వంసకర బ్యాటింగ్​తో పొట్టి ఫార్మాట్​కు ఊపు తెచ్చే ఈ కరీబియన్​ ఆటగాడు.. యూఏఈలో జరిగిన గత సీజన్​లో ప్రారంభ మ్యాచ్​లకు ఎంపిక కాలేదు. తర్వాతి చివరి 7 మ్యాచ్​లు ఆడిన గేల్​.. 41.14 సగటుతో 288 పరుగులు సాధించాడు. ఇందులో 23 సిక్స్​లతో పాటు 15 ఫోర్లు ఉన్నాయి.

ఇదీ చదవండి:బూట్లు లేని స్థితి నుంచి ఐపీఎల్​లో అదరగొట్టి..

సోమవారం రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో అర్ధసెంచరీకి 10 పరుగుల దూరంలో అవుటయ్యాడు గేల్​. 40 రన్స్​ సాధించిన అతడిని.. చిరాగ్​ పరాగ్​ పెవిలియన్​ పంపాడు. పంజాబ్​ తరఫున అతనాడిన ఐపీఎల్​ ప్రారంభ మ్యాచ్​ల్లో హాఫ్ సెంచరీలు చేసిన క్రిస్​.. ఈ సారి త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకున్నాడు.

గతంలో ఇలా..

  • 2018 సీజన్లో చెన్నై సూపర్​ కింగ్స్​పై 33 బంతుల్లో 62 పరుగులు.
  • 2019 సీజన్లో రాజస్థాన్​ రాయల్స్​పై 47 బంతుల్లో 79 పరుగులు.
  • 2020 సీజన్లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగుళూరుపై 45 బంతుల్లో 53 పరుగులు.

ఐపీఎల్​లో ఇప్పటి వరకు 13 సీజన్లలో 133 మ్యాచ్​లాడిన ఈ 41 ఏళ్ల విండీస్​ క్రికెటర్​.. మొత్తంగా 4812 రన్స్​ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇదీ చదవండి:గోల్ఫ్​లో మత్సుయామ సరికొత్త రికార్డు

ABOUT THE AUTHOR

...view details