తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పిచ్​ ఏదైనా.. సన్​రైజర్స్​ తలరాత అంతే': పాక్​ మాజీ క్రికెటర్​ - ఐపీఎల్​ సన్​రైజర్స్​ హైదరాబాద్​

Salman Butt IPL: ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ వరుస ఓటములపై పాక్​ మాజీ క్రికెటర్​ సల్మాన్​ భట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టు యాజమాన్యంతో.. ఆటగాళ్లకు ఏదో తేడా కొట్టిందని అన్నాడు. పిచ్​ ఏదైనా.. తలరాత మాత్రం మారట్లేదని తెలిపాడు.

By

Published : Apr 5, 2022, 1:30 PM IST

Salman Butt IPL: ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్‌ వరుసగా రెండో ఓటమిని ఎదుర్కొంది. అయితే.. మొదటి మ్యాచ్‌తో పోలిస్తే గత మ్యాచ్‌లో ఆఖరి వరకూ పోరాడింది. లఖ్​నవూతో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో హైదరాబాద్‌ ఓడింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ మాజీ సారథి సల్మాన్‌ భట్‌ పలు సందేహాలను వెలిబుచ్చాడు. హైదరాబాద్‌ ఆటగాళ్ల ప్రదర్శన ఆకట్టుకోలేదన్నాడు. అంతేకాకుండా యాజమాన్యంతో ఆ జట్టు సభ్యులకు ఏదో తేడా కొట్టినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. ''హైదరాబాద్‌ జట్టు ఏం మారలేదు. పిచ్‌ ఏదైనా సరే వారి తలరాత మాత్రం మారడం లేదు. అందుకే ఈ జట్టుతోపాటు ఫ్రాంఛైైజీలోనూ ఏదో లోపం ఉందనిపిస్తోంది.'' అని భట్‌ తన యూట్యూబ్​ ఛానెల్లో పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్ సరిగా లేదని సల్మాన్‌ భట్‌ తెలిపాడు. టాప్‌ఆర్డర్‌లో చాలా దూకుడుగా ఆడతాడని పేర్కొన్నాడు. ''మార్‌క్రమ్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌. ఆ స్థానంలో చాలా ప్రభావం చూపే ఆటగాడు. అయితే హైదరాబాద్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ మాత్రం మార్‌క్రమ్‌ను నాలుగు, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపుతుంది. టాప్‌ఆర్డర్‌లో అయితే దూకుడుగా ఆడగలడు. ప్రస్తుతం ఆడుతున్న స్థానాల్లో ఎక్కువ మ్యాచుల్లో స్కోరు చేయలేడు.'' అని సల్మాన్‌ భట్ చెప్పాడు. లఖ్‌నవూను 169 పరుగులకే కట్టడి చేసిన హైదరాబాద్‌ ఛేదనలో మాత్రం 157 పరుగులకే పరిమితమైంది. హైదరాబాద్​ తన తదుపరి మ్యాచ్​లో ఏప్రిల్​ 9న చెన్నై సూపర్​కింగ్స్​తో తలపడనుంది. చెన్నై కూడా ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్​ల్లో ఓడింది.

ABOUT THE AUTHOR

...view details