తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆటగాళ్లు నిష్క్రమిస్తున్నా.. ఐపీఎల్​ కొనసాగుతుంది' - bcci ipl zampa

దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్​ నుంచి ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్నారు. ఇప్పటికే దిల్లీ ఆటగాడు అశ్విన్​తో పాటు ముగ్గురు ఆసీస్​ ఆటగాళ్లు ఇంటిబాట పట్టారు. అయినప్పటికీ లీగ్​ యథావిధిగా కొనసాగుతుందని బీసీసీఐ ప్రకటించింది.

Early exits as COVID cases surge in India; BCCI says league will go on
బీసీసీఐ, ఐపీఎల్​

By

Published : Apr 26, 2021, 4:01 PM IST

దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ లీగ్‌ నుంచి ఇండియన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వైదొలిగాడు. అంతేకాదు, ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం లీగ్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు తెలిపారు. తాజా పరిస్థితిపై బీసీసీఐ స్పందించింది. లీగ్‌ నుంచి నిష్క్రమణలు ఉన్నా, ఐపీఎల్‌ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.

తన కుటుంబ సభ్యులు కరోనాతో పోరాడుతుండటం వల్ల వారికి అండగా ఉండేందుకు సిరీస్‌ నుంచి తప్పుకొంటున్నట్లు దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు అశ్విన్‌ తెలిపాడు. ఆండ్రూ టై(రాజస్థాన్‌), కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా(రాయల్‌ ఛాలెంజర్స్‌)లు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. 'ఐపీఎల్‌ 14వ సీజన్​ యథావిధిగా కొనసాగుతుంది. ఎవరైనా లీగ్‌ నుంచి తప్పుకోవాలనుకుంటే మంచిదే' అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఆ మార్క్ అందుకున్న నాలుగో క్రికెటర్​ బెయిర్​ స్టో

ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ తెలిపాయి. భారత్‌ నుంచి వచ్చే సమాచారాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు వెల్లడించాయి. ప్రస్తుతం 14 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్‌ ఉన్నారు. లీగ్‌ అయిపోయిన వెంటనే ప్రత్యేక విమానంలో వీరిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి:'మనీష్​ను తీసుకోకపోవడం కఠిన నిర్ణయం'

ABOUT THE AUTHOR

...view details