rcb retained players 2021: ఐపీఎల్లో వచ్చే మూడు సీజన్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నాడు కోహ్లీ. ఆర్సీబీ వీడాలన్న ఆలోచనే తనకు అస్సలు లేదని చెప్పాడు. నవంబరు 30న జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో ఆర్సీబీ.. కోహ్లీ, మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్ను తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశాడు విరాట్.
"ఆర్సీబీ నన్ను రిటెయిన్ చేసుకుంది. ఎన్నో ఏళ్ల నుంచి మా ప్రయాణం అద్భుతం కొనసాగుతోంది. జట్టు వీడాలన్న ఆలోచన నాకు అస్సలు రాలేదు. ఇంకో మూడేళ్ల పాటు మేం కలిసి జర్నీ చేయబోతుండటం నాకెంతో సంతోషంగా ఉంది. వచ్చే సీజన్లలో మా జట్టు మరింత ఉత్తమంగా ఆడుతుందని భావిస్తున్నాను. వచ్చే సీజన్ ఎలా సాగబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మాకు అద్భుతమైన ఫ్యాన్ బేస్, మేనేజ్మెంట్ ఉంది. మైదానంలో నాలోని కొత్త వెర్షన్(పునరుత్తేజాన్ని) చూస్తారు."