శిబిరం నుంచి ఇంటికి వెళ్లే ఆఖరి వ్యక్తిని తానే అవుతానని చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ అన్నాడని తెలిపింది ఫ్రాంచైజీ. ముందుగా విదేశీయులు ఇళ్లకు వెళ్తారని ఆ తర్వాత భారత ఆటగాళ్లు వెళ్లాలని సూచించాడని పేర్కొంది. అందరూ వెళ్లాకే తాను రాంచీకి బయల్దేరుతానని స్పష్టం చేశాడని వెల్లడించింది. ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్ శిబిరమంతా దిల్లీలో ఉంది. ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు బయల్దేరారు.
ఎయిర్ అంబులెన్స్‌లో హస్సీ, చివర్లో రాంచీకి ధోనీ'
ఐపీఎల్ వాయిదా కారణంగా వారి వారి ఇళ్లకు పయనమవుతున్నారు ఆటగాళ్లు. కాగా అందరూ వెళ్లాకే తాను బయల్దేరతానని స్పష్టం చేశాడట చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. అలాగే కరోనా సోకిన మైఖేల్ హస్సీ, బాలాజీలను ఎయిర్ అంబులెన్స్ ద్వారా చెన్నైకి పంపిస్తామని తెలిపింది.
"ఐపీఎల్ భారత్‌లో జరుగుతోంది కాబట్టి తొలుత విదేశీయులు, సహాయ సిబ్బంది వెళ్లాలని చెప్పాడు. ఆ తర్వాతి ప్రాధాన్యం భారతీయులకని పేర్కొన్నాడు. హోటల్‌ను విడిచే ఆఖరి వ్యక్తిని తానే అవుతానని ధోనీ తెలిపాడు" అని ఫ్రాంచైజీ వెల్లడించింది.
అలాగే చెన్నై కోచ్ మైఖేల్ హస్సీ, బాలాజీకి కరోనా సోకగా వారిద్దరినీ ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నై పంపిస్తామని ఫ్రాంచైజీ తెలిపింది. ప్రస్తుతం వారిద్దరూ బాగున్నారని నెగిటివ్ వచ్చాక ఇద్దరూ ఇంటికి వెళతారని పేర్కొంది. హస్సీ ఇంటికి వెళ్లే సమయంలో అతడి కోసం ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది.