ఐపీఎల్ ఆగిపోయిన మ్యాచ్‌ల్ని ఎప్పుడు నిర్వహిస్తారా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మే 29న జరిగే స్పెషల్ జనరల్ మీటింగ్ తర్వాత ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే ఆ మ్యాచ్‌లన్నింటినీ యూఏఈ వేదికగా జరపాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకోసం సెప్టెంబరు-అక్టోబరు విండోను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
యూఏఈలో ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లు! - ipl winner RCB
కరోనా వల్ల ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్‌లోని మ్యాచ్‌ల్ని సెప్టెంబరు-అక్టోబరులో జరపాలని బీసీసీఐ భావిస్తోంది. త్వరలో ఈ విషయంతో పాటు వేదిక గురించి స్పష్టత వచ్చే అవకాశముంది.
త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్న టీమ్ఇండియా.. జూన్ 18న న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో తలపడతుంది. ఇది పూర్తయిన వెంటనే అంటే సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 మధ్యలో ఐపీఎల్ మిగతా మ్యాచ్‌ల్ని నిర్వహించాలనే ఆలోచనతో భారత క్రికెట్ బోర్డు ఉంది. ఆ నెల రోజుల్లో 31 మ్యాచ్‌ల్ని జరపాలని భావిస్తోంది. అక్టోబరు ద్వితియార్ధంలో జరిగే టీ20 ప్రపంచకప్ ఉండటమే ఈ విండో ఎంపికకు కారణంగా తెలుస్తోంది.