మూడు వారాల ఐసోలేషన్ తర్వాత దిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి చేరాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు అక్షర్ పటేల్‌కు కరోనా సోకగా.. ముంబయిలోని బీసీసీఐ క్వారంటైన్లో గడిపాడు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఇప్పుడు జట్టులోకి చేరాడు. ఈ విషయాన్ని దిల్లీ క్యాపిటల్స్ జట్టు ట్విట్టర్లో వెల్లడించింది.
దిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో అక్షర్ పటేల్ - ఢిల్లీ క్యాపిటల్స్
కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న దిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి చేరాడు. ఈ విషయాన్ని దిల్లీ ఫ్రాంఛైజీ ట్విట్టర్లో వెల్లడించింది.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు మార్చి 28న బయోబబుల్‌కు వచ్చే ముందు అక్షర్ పటేల్‌కు కరోనా నెగెటివ్‌గానే తేలింది. కానీ, ఏప్రిల్ 3న చేసిన పరీక్షల్లో అతడికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అవ్వడం వల్ల బీసీసీఐ మెడికల్ టీమ్ ఏర్పాటుచేసిన క్వారంటైన్లో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ దేవ్‌దత్ పడిక్కల్ తర్వాత అక్షర్ పటేల్ కరోనా సోకినట్లు తేలింది. ఐపీఎల్లో ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో దిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.
ఇదీ చూడండి..బెంగళూరు, రాజస్థాన్ మ్యాచ్‌పై ఎవరేమన్నారంటే?