ఐపీఎల్లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లను స్వదేశానికి పంపించే విషయంపై స్టార్ ప్లేయర్ మ్యాక్స్వెల్ స్పందించాడు. లీగ్ అనంతరం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) కోసం ఇంగ్లాండ్ వెళ్లనున్న భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లతో పాటు తమని కూడా పంపించే అంశం పరిశీలించాలని బీసీసీఐకి సూచించాడు.
"మేము స్వదేశానికి వెళ్లడానికి ఒక మార్గం కనుక్కోండి చాలు. దీనిపై బీసీసీఐ, ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయం తీసుకోండి. డబ్ల్యూటీసీ కోసం ఇంగ్లాండ్ ఆటగాళ్లు వెళ్లనున్న విమానంలో మమ్మల్ని కూడా పంపించండి. అక్కడికి వెళ్లాక ఏదో విధంగా ఆస్ట్రేలియాకు చేరుకోవచ్చు" అని మ్యాక్స్వెల్ సూచించాడు.