విదేశీ క్రికెటర్లు అందుబాటులో లేనంత మాత్రాన ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ల నిర్వహణ ఆగదని బీసీసీఐ(BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ సీజన్లో యూఏఈలో జరపనున్నట్లు ఇటీవల ప్రకటించారు.
"మేం(బీసీసీఐ) విదేశీ ప్లేయర్ల సమస్య గురించి చర్చించనున్నాం. ఈ సీజన్ పూర్తి చేయడమే మా ప్రస్తుత ప్రధాన లక్ష్యం. మధ్యలో వదిలేయలేం కదా. అందుకే విదేశీ ఆటగాళ్లు ఎవరు వచ్చినా రాకపోయినా మిగిలిన మ్యాచ్లు జరుగుతాయి. ఒకవేళ అందుబాటులో లేనివాళ్లకు బదులు ఇతర ప్లేయర్లను ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకుంటాయి" అని రాజీవ్ శుక్లా చెప్పారు.