ఐపీఎల్లో(IPL) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) అనగానే మనకు కోహ్లీ(Kohli), ఏబీ డివిలియర్స్(De villiers) మనకు గుర్తొస్తారు. ఈ సీజన్లో మ్యాక్స్‌వెల్ కూడా రావడం వల్ల బ్యాటింగ్ విభాగం మరింత బలంగా మారింది. అయితే స్టార్ క్రికెటర్లు స్మిత్, మోర్గాన్, భువనేశ్వర్ కుమార్ తదితరులు ఈ జట్టుకు ఆడారని మీకు తెలుసా? ఒకవేళ మీకు దీని గురించి తెలియకపోతే ఈ స్టోరీ చదివేయండి.
స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్మిత్.. లెగ్ స్పిన్నర్‌గా తన కెరీర్ మొదలుపెట్టాడు. 2010లో జెస్సీ రైడర్‌కు ప్రత్యామ్నయంగా ఆర్సీబీ ఇతడిని ఎంపిక చేసుకుంది. కానీ ఆ సీజన్లో స్మిత్‌కు ఆడే అవకాశం రాలేదు. 2011లో మెగా వేలానికి ముందు ఇతడిని బెంగళూరు జట్టు వదిలేసుకుంది. ఆ తర్వాత ఏడాది కొచి టస్కర్స్ జట్టులోకి వచ్చినా మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఎట్టకేలకు 2012లో పుణె వారియర్స్ తరఫున స్మిత్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం దిల్లీ తరఫున ఆడుతున్నాడు.
ఇయాన్ మోర్గాన్
ఇంగ్లాండ్ ప్రముఖ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్.. 2010లో ఆర్సీబీలోకి వచ్చాడు. స్మిత్‌లా కాకుండా ఆ సీజన్లో ఇతడు ఆరు మ్యాచ్‌లాడి కేవలం 35 పరుగులే చేశాడు. దీంతో మోర్గాన్‌ను బెంగళూరు జట్టు విడిచిపెట్టింది. ప్రస్తుతం కోల్‌కతా జట్టులో ఉన్నాడు.
భువనేశ్వర్ కుమార్