తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎప్పుడొచ్చామన్నది కాదు, సత్తాచాటామా లేదా - shaheen afridi

2019 ప్రపంచకప్​లో కొత్త ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెప్పించారు. వీరి ప్రదర్శనపై ఓ లుక్కేద్దాం.

5 finds of the ICC World Cup 2019
మ్యాచ్

By

Published : Jul 19, 2019, 5:51 AM IST

Updated : Aug 18, 2022, 7:29 PM IST

ప్రపంచకప్ ఆడటం ప్రతి ఆటగాడి కల. అందుకోసం ఎంతో కృషి చేయడమూ అవసరం. అనుభవమున్న ఆటగాళ్లు సరే.. మరి యువ ఆటగాళ్ల మాటేంటి?. వారికీ ఈ మెగాటోర్నీ మంచి వేదిక. 2019 క్రికెట్ విశ్వసమరంలో కొత్త ఆటగాళ్లు సత్తా చాటారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వనియోగం చేసుకుని చెలరేగి ఆడారు. వారిపై ఓ లుక్కేద్దాం.

షాహీన్ అఫ్రిదీ (పాకిస్థాన్)

ఈ ప్రపంచకప్​ ద్వారా పాకిస్థాన్​కు ఓ మంచి లెఫ్టార్మ్ పేసర్ దొరికినట్టయింది. ప్రారంభంలో అవకాశం రాకపోయినా.. మధ్యలో వచ్చిన అవకాశాన్ని కాపాడుకుని 5 మ్యాచ్​ల్లో 16 వికెట్లు తీసి సత్తాచాటాడు. ఈ యువ ఆటగాడి ప్రతిభ చూసిన క్రికెట్ అభిమానులు అతడిని పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్​తో పోలుస్తున్నారు. భవిష్యత్​లో మంచి ఆటగాడు అవుతాడని ప్రశంసిస్తున్నారు.

జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లాండ్)

ఇంగ్లాండ్ యువ పేసర్ జోఫ్రా ఆర్చర్ పేరు ప్రపంచకప్​నకు ముందు అంతగా ఎవరికీ తెలియదు. టోర్నీ ప్రారంభానికి ముందే మేలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆర్చర్ అనూహ్యంగా వరల్డ్​కప్ జట్టులో చోటు సంపాదించాడు. డేవిడ్ విల్లే గాయం కారణంగా తప్పుకోగా.. ఈ యువ ఆటగాడికి అవకాశం లభించింది. ఇంగ్లాండ్ సారథి మోర్గాన్.. జోఫ్రాకు స్వేచ్ఛనిస్తూ ప్రోత్సహించగా.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టోర్నీలో 20 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మూడో స్థానం సాధించాడు.

అలెక్స్ కారే (ఆస్ట్రేలియా)

వికెట్ కీపర్​, బ్యాట్స్​మెన్​గా జట్టులో చోటు సంపాదించాడు కారే. ఆసీస్ తరఫున 375 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్​తో జరిగిన సెమీఫైనల్​ మ్యాచ్​లో ఆర్చర్ బౌలింగ్​లో దవడకు గాయమై రక్తం కారుతున్నా.. బ్యాటింగ్ చేసి అబ్బురపరిచాడు. కారేను ఆసీస్ మాజీ వికెట్ కీపర్ గిల్​క్రిస్ట్​తో పోలుస్తున్నారు అభిమానులు.

ఇక్రామ్ అలీ ఖాన్

అఫ్గానిస్థాన్​ యువ ఆటగాడు ఇక్రామ్ అలీ వయస్సు 18 ఏళ్లు. వెస్టిండీస్​పై 86 పరుగులు సాధించి ప్రపంచకప్​లో అత్యంత పిన్న వయసులో 80 పైన పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రికెటర్ ప్రతిభను గుర్తించి అఫ్గాన్ క్రికెట్ మరిన్ని అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే మరింతగా రాటుదేలుతాడని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

ఇవీ చూడండి.. 'ఇదిగో యువీ.. నా బాటిల్ క్యాప్ ఛాలెంజ్'

Last Updated : Aug 18, 2022, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details