IPL Uncapped Players 2023 : దుబాయ్ వేదికగా ఐపీఎల్-2024 మినీ వేలం గ్రాండ్‌గా జరిగింది. ఇందులో భాగంగా ఎంతో మంది ప్లేయర్లను ఆయా ఫ్రాంచైజీలు భారీ మొత్తంతో సొంతం చేసుకుంటోంది. అందులో సమీర్ రిజ్వీ, షారుక్ ఖాన్, శుభమ్ దూబె, కుమార్ కుశాగ్రాలు లాంటి అన్క్యాప్డ్ ప్లేయర్లను అనూహ్య ధరలకు ఫ్రాంచైజీలు సొంతం చేసుకుంది. దీంతో అందరి దృష్టి ఈ కుర్రాళ్లపై పడింది. వీరి గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మినీ వేలం స్టార్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..
సమీర్ రిజ్వి
- 20 ఏళ్ల సమీర్ రిజ్విని రూ. 8.4 కోట్లకు సీఎస్‌కే జట్టు సొంతం చేసుకుంది.
- ఇతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
- 2020లో మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీతో రిజ్వీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు. అయితే రిజ్వీకు టీ20 క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. 9 ఇన్నింగ్స్‌లలో రిజ్వీ 49.16 సగటుతో 295 పరుగులు సాధించాడు.
- ఇక ఈ ఏడాది జరిగిన యూపీ టీ20 లీగ్‌లో రిజ్వీ అదరగొట్టాడు. ఈ లీగ్‌లో కాన్పూర్ సూపర్ స్టార్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రిజ్వీ ఈ మ్యాచ్‌లో 455 పరుగులు చేశాడు. అంతే కాకుండా ఆ టోర్నీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు.
- మెన్స్ అండర్-23 స్టేట్- ఏ టోర్నమెంట్‌లో రాజస్థాన్‌తో వన్డే మ్యాచ్‌లో 65 బంతుల్లోనే 91 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ లీగ్‌లో యూపీ జట్టుకు సారధిగా వ్యవహరించాడు.
- ఆ టోర్నీ ఫైనల్లో 50 బంతుల్లోనే 84 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఈ లీగ్‌లో మొత్తం 37 సిక్స్‌లు బాదాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా మెరిశాడు. ఇందులో 18 సిక్స్‌లు కొట్టి రికార్డుకెక్కాడు. ఇక టీ20ల్లోనూ అద్భుతంగా రాణిస్తుండటం వల్ల చెన్నై జట్టు రిజ్వీని భారీ ధరకు సొంతం చేసుకుంది.
షారుక్ ఖాన్
- ఈ మినీ వేలంలో తమిళనాడు క్రికెటర్ షారుక్ ఖాన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు అతన్ని రూ. 7.40 కోట్లకు దక్కించుకుంది.
- పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఈ యువ ఫినిషర్‌ను దక్కించుకునేందుకు గట్టి పోటీ నెలకొంది. అయితే చివరకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.
- 29 ఏళ్ల యంగ్ ప్లేయర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో విజయ్ హజారే ట్రోఫీలో ఈ యంగ్ ప్లేయర్‌కు మంచి రికార్డే ఉంది.
- దేశీయ స్థాయిలో తన జట్లకు టాప్-క్లాస్ ప్రదర్శనలు ఇస్తున్న షారుక్ ఇప్పటి వరకు 83 టీ20ల్లో 928 పరుగులు చేశాడు.