IPL mega auction 2022: ఐపీఎల్ రెండు రోజు వేలం కూడా ఆసక్తికరంగా సాగుతోంది. కొంతమంది ప్లేయర్లు అధిక ధరకు అమ్ముడుపోతుండగా మరికొందరు తక్కువ ధర పలుకుతున్నారు. అయితే ఈ ఆటగాళ్లలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్లు అదరగొట్టారు. ఒడియన్ స్మిత్, రొమారియో షెపర్డ్‌కు భారీ ధర దక్కింది. అంతర్జాతీయ టీ-20 టోర్నీల్లో అదరగొడుతున్న ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్ మంచి ధర పలికాడు.
టిమ్‌డేవిడ్
అంతర్జాతీయ టీ-20 టోర్నీల్లో అదరగొడుతున్న ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్‌ను మంచి ధర పలికాడు. ఇతడి కోసం పలు జట్లు పోటీపడినా చివరికి ముంబయిదే పైచేయి అయింది. రూ. 8.25 కోట్లకు అతడిని దక్కించుకుంది. ఇతడి టీ-20 స్ట్రైక్ రేట్ 159.39 కావడం విశేషం. బంతిని బలంగా బాదగల ఈ పొడగరి కచ్చితంగా టీమ్‌లో ఉండే అవకాశముంది.
6.5 అడుగుల ఎత్తు ఉండే టిమ్.. ఇప్పటివరకు 14 టీ20 అంతర్జాతీయ మ్యాచులు ఆడి 558 పరుగులు చేశాడు. ఇతడి అత్యధిక స్కోరు 92 నాటౌట్. ఇతడు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. గతంలో టిమ్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు.
స్మిత్