IPL 2023 DHONI: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఫైనల్‌కు చేరిన జట్టుగా.. అత్యధిక అభిమానులు ఉన్న జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ పేరు సంపాదించుకుంది. లీగ్ చరిత్రలోనే రెండో విజయవంతమైన జట్టుగా సీఎస్కే రికార్డు సృష్టించింది. లీగ్ మొదటి సీజన్ నుంచి సీఎస్కేకు సారథ్యం వహిస్తున్న ఎంఎస్ ధోనీ.. ప్రస్తుతం బ్యాటర్‌గా ఫామ్‌లో లేకపోయినా కెప్టెన్సీలో మాత్రం అదరగొడుతున్నాడు. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్లో మిస్టర్ కూల్ ఆడనున్నారా లేదా అనే సందిగ్ధత అభిమానుల్లో నెలకొంది. ఈ విషయంపై సీఎస్కే అధికారులు స్పందించారు.
వచ్చే ఐపీఎల్‌లో ధోనీ మళ్లీ ఆడతాడా? ఇదే చివరిదా? - ఐపీఎల్ సీజన్లో ధోని ఆడతాడా
IPL 2023 DHONI: ఐపీఎల్ తొలి సీజన్ నుంచి సీఎస్‌కేను నడిపిస్తున్న ఏకైక సారథి ఎంఎస్ ధోనీ.. బ్యాటర్‌గా ఫామ్‌లో లేకపోయినా కెప్టెన్సీ మాత్రం అదరగొట్టేస్తున్నాడు. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ధోనీ ఆడనున్నాాడా లేదా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, ఈ విషయంపై స్పందించిన సీఎస్కే అధికారి ఏమన్నారంటే?
వచ్చే సీజన్లో ఆడతాడా లేదా అనేది మహీ ఇంకా తమకు స్పష్టతఇవ్వలేదని ఓ సీఎస్కే అధికారి అన్నారు. అది అతడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఇంకా కొన్ని సీజన్లు అతడు ఆడాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఒకవేళ ధోనీ కెప్టెన్‌గా తప్పుకుంటే కొత్త కెప్టెన్ ఎవరనే విషయంపై ఇంకా ఆలోచించలేదని అన్నారు.
ఐపీఎల్ 15వ సీజన్ మార్చి 26న ప్రారంభమై.. మే 29న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ఈసారి లఖ్‌నవూ, గుజరాత్ జట్ల రాకతో పది జట్లు కప్పుకోసం పోటీ పడుతున్నాయి. లీగ్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోనే జరుగుతాయని బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల 26న వాంఖడే స్టేడియంలో సీఎస్కే తన తొలి మ్యాచ్‌లో కోల్‌కతాతో తలపడనుంది.
ఇదీ చదవండి:ఐపీఎల్‌లో హోరాహోరీగా సాగిన ముంబయి x చెన్నై మ్యాచ్‌లివే