Ravi Shastri: అప్పట్లో టీ20 లీగ్ ఉండుంటే నాటి దిగ్గజాలకు వేలంలో ఎంత ధర పలికేదన్న ఆలోచన అభిమానులకు వస్తూ ఉంటుంది. ఎంత అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానమైతే లేదు. కానీ మాజీ ఆల్‌రౌండర్ రవిశాస్త్రి మాత్రం ఇప్పటి లెక్క ప్రకారం తనకు రూ.15 కోట్ల ధర పలికి ఉండేదని నిస్సంకోచంగా చెప్పాడు. ఓ జట్టుకు కెప్టెన్ అయ్యుండేవాడినని కూడా అన్నాడు. వేలంలో మీరెంతకు అమ్ముడయ్యుండేవారని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు అతడు ఇటీవలే బదులిచ్చాడు.
IPL 2022: వేలంలో నాకైతే రూ.15 కోట్లు వచ్చేవి: రవిశాస్త్రి - ఐపీఎల్ 2022 లేటెస్ట్ న్యూస్
Ravi Shastri: ఐపీఎల్ వేలంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. తాను వేలంలో పాల్గొంటే తనకు రూ.15 కోట్లు వచ్చేవని అన్నాడు. ఓ జట్టుకు కెప్టెన్ కూడా అయ్యేవాడిని అని చెప్పాడు.
ravi shastri commentary
"కచ్చితంగా నాకు రూ.15 కోట్లు వచ్చేవి. ఓ జట్టుకు కెప్టెన్ కూడా అయ్యుండేవాణ్ని. ఇది ఎవ్వరైనా చెప్పగలరు" అని రవిశాస్త్రి చెప్పాడు. శాస్త్రి 80 టెస్టుల్లో 3,830 పరుగులు చేశాడు. 151 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 129 వికెట్లు చేజిక్కించుకున్న అతడు.. 3,108 పరుగులు సాధించాడు. ఓ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టాడు.