బౌలర్లను ఊచకోత కోస్తూ భారీ లక్ష్యాన్ని సైతం అలవోకగా ఛేదించేసింది పంజాబ్. మెగా టీ20 టోర్నీలో భాగంగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ ఐదు వికెట్లను మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో 208 పరుగులు చేసి విజయం సాధించింది. పంజాబ్ బ్యాటర్లు సమష్ఠిగా రాణించడంతో బెంగళూరు బౌలర్లు అడ్డుకోలేకపోయారు. పంజాబ్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (32), శిఖర్ ధావన్ (43), భానుక రాజపక్స (43), లియామ్ లివింగ్ స్టోన్ (19) రాణించారు.