IPL 2022 MS Dhoni: 2022 ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 12,13న బెంగళూరులో జరగనున్న వేలం కోసం జట్లన్ని సిద్ధమవుతున్నాయి. దీనికి రెండు వారాలే ఉన్న నేపథ్యంలో సీఎస్కే కెప్టెన్ ధోనీ చెన్నై చేరుకున్నాడు. గురువారం ఓ హోటల్లో కనిపించాడు.
ఆటగాళ్ల ఎంపికలో జట్టు యాజమాన్యానికి ధోనీ సలహాలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. గత సీజన్లలోనూ మెరుగైన ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంలో ధోనీ కీలకపాత్ర పోషించారు. ఈసారి సీఎస్కే నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. అందులో ధోనీ, జడేజా, రుతురాజ్, మొయిన్ అలీ ఉన్నారు. జడేజాకు రూ.16 కోట్లు కేటాయించగా, ధోనికి రూ.12కోట్లు, మొయిన్ అలీకి రూ.8 కోట్లు, రుతురాజ్కు రూ.6 కోట్లు టీం యాజమాన్యం వెచ్చించింది. మిలిగిన ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి సీఎస్కే ఇంకా రూ.48 కోట్లు ఖర్చు చేయనుంది.