బ్రబౌర్న్ వేదికగా దిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి జట్టు బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేశారు. దిల్లీ జట్టుకు 178 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇషాన్ కిషన్(81) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా.. రోహిత్‌శర్మ(41) బాగా ఆడాడు. మిగతా వారు విఫలమయ్యారు.
IPL 2022: దంచికొట్టిన ఇషాన్.. దిల్లీ లక్ష్యం ఎంతంటే?
IPL 2022 MI VS DC: ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు బ్యాటర్లు ధాటిగా ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం చేశారు. ఇషాన్ కిషన్(81)అద్భుతంగా రాణించాడు. అయితే నిలకడగా ఆడుతున్న సారథి రోహిత్ శర్మను (41) దిల్లీ బౌలర్ కుల్దీప్యాదవ్ ఔట్ చేశాడు. దీంతో హిట్‌మ్యాన్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్(8), తిలక్ వర్మ(22), పోలార్డ్(3), టిమ్ డేవిడ్(12) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఇషాన్ కిషన్(81), డానియల్ సామ్స్(7) నాటౌట్‌గా నిలిచారు. దిల్లీ బౌలర్లలలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఇదీ చదవండి:IPL 2022 CSK: 'కెప్టెన్సీపై గతేడాదే నిర్ణయం తీసుకున్నాం'