IPL 2022 Mega auction: కొన్నేళ్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన పేసర్ ఖలీల్ అహ్మద్ ఐపీఎల్ వేలంలో అదరగొట్టాడు. ఇతడి కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. చివరికి దిల్లీ రూ. 5.25 కోట్లకు సొంతం చేసుకుంది. రాజస్థాన్‌కు ఆడిన చేతన్ సకారియాను కూడా రూ. 4.20 కోట్లు పెట్టి కొనుక్కుంది.
- లంక బౌలర్ దుష్మంత చమీరాను రూ. 2 కోట్లకు లఖ్‌నవూ దక్కించుకుంది.
- అండర్-19 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన భారత ఆల్‌రౌండర్ రాజ్ బావాను రూ. 2 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది.
- బౌలింగ్‌లో ఇరగదీసిన రాజ్వర్ధన్ హంగార్గేకర్‌ను రూ.1.50 కోట్లకు చెన్నై గెల్చుకుంది.
- ఉత్తర్‌ప్రదేశ్ లెఫ్టార్మ్ పేసర్ యష్ దయాల్ కోసం ఫ్రాంఛైజీలు తీవ్రంగా పోటీపడినా.. రూ.3.20 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
ఇంకా ఎవరెవరు ఎంతకు?
నవదీప్ సైనీ - రూ.2.60 కోట్లు- రాజస్థాన్ రాయల్స్
జయదేవ్ ఉనద్కత్ - రూ. 1.30 కోట్లు- ముంబయి ఇండియన్స్
తిలక్ వర్మ - రూ.1.70 కోట్లు -ముంబయి ఇండియన్స్
సంజయ్ యాదవ్ - రూ.50 లక్షలు- ముంబయి ఇండియన్స్