IPL 2022 Mega auction: ఐపీఎల్ మెగావేలం జరుగుతుండగా అపశ్రుతి నెలకొంది. వేలం పాడే వ్యక్తి (ఆక్షనీర్) హ్యూజ్ ఎడ్మీడ్స్ ఒక్కసారిగా స్టేజీపైనే కుప్పకూలాడు.రెండో సెట్లో చివరి ఆటగాడైన వానిండు హసరంగ కోసం పంజాబ్, హైదరాబాద్ జట్ల మధ్య తీవ్ర పోటీ పడుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో వేలం ప్రక్రియలో కాసేపు విరామం ప్రకటించారు. తిరిగి వేలాన్ని 3.30 గంటలకు ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. అతడి స్థానంలో చారు షర్మ వేలం పాట నిర్వాహకుడిగా వ్యవహరించనున్నట్లు తెలిపారు.
IPL 2022 Mega auction: స్టేజిపైనే కుప్పకూలిన ఐపీఎల్ ఆక్షనీర్ - ఐపీఎల్ 2022 మెగావేలం
IPL 2022 Mega auction: ఐపీఎల్ మెగావేలంలో కాసేపు విరామం ప్రకటించారు. వేలం పాడే వ్యక్తి (ఆక్షనీర్) హ్యూజ్ ఎడ్మీడ్స్ ఒక్కసారిగా స్టేజీపైనే కుప్పకూలడం వల్ల బ్రేక్ తీసుకున్నారు. అతడిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు.
కుప్పకూలిన ఆక్షనీర్
కాగా, ఇప్పటివరకు సాగిన ఈ వేలం ప్రక్రియలో టీమ్ఇండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని రూ.12.25 కోట్లు చెల్లించి మరీ సొంతం చేసుకుంది.
- ధావన్-రూ.8.25కోట్లు-పంజాబ్ కింగ్స్
- కగిసో రబాడ - రూ. 9.25 కోట్లు- పంజాబ్ కింగ్స్
- న్యూజిలాండ్ బౌలర్ బౌల్ట్- రూ. 8కోట్లు- రాజస్థాన్
- ప్యాట్ కమిన్స్- రూ.7.25 కోట్లు- కోల్‌కతా
- డుప్లెసిస్- రూ.7 కోట్లు- బెంగళూరు
- డికాక్- రూ. 6.75 కోట్లు- లఖ్‌నవూ సూపర్ జెయింట్స్
- మహ్మద్ షమి- రూ. 6.25 కోట్లు- గుజరాత్ టైటాన్స్
ఇదీ చూడండి: IPL Auction 2022: శ్రేయస్‌కు కాసుల పంట.. ఏ ఆటగాడికి ఎంతంటే?
Last Updated : Feb 12, 2022, 4:11 PM IST