తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: తొలి మ్యాచ్​లో చెన్నైపై కోల్​కతా ఘన విజయం - ipl csk vs kkr winner

IPL 2022 CSK VS KKR: వాంఖడే వేదికగా జరిగిన ఐపీఎల్​ 15వ సీజన్​ తొలి మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ శుభారంభం చేసింది. చెన్నై సూపర్​కింగ్స్​పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది

ఐపీఎల్​ 2022
కోల్​కతా విజయం

By

Published : Mar 26, 2022, 11:06 PM IST

IPL 2022 CSK VS KKR: ఐపీఎల్ 15వ సీజన్​ మొదటి మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ ఘన విజయం సాధించింది. చెన్నై జట్టు నిర్దేశించిన 132 పరుగులను 18.3 ఓవర్లలోనే ఛేదించింది.

132 స్వల్ప పరుగుల లక్ష్యఛేదనకు దిగిన కోల్​కతా జట్టు ఓపెనర్లు అజింక్య రహెనే, వెంకటేష్​ అయ్యర్​ శుభారంభం చేశారు. మెుదటి ఓవర్లోనే వెంకటేశ్ అయ్యర్​(16).. బ్రావో బౌలింగ్​లో అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన నితిశ్​ రానా(21) నిలకడగా ఆడగా.. బ్రావో వేసిన పదో ఓవర్లో రాయుడుకు క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​కు చేరాడు. అర్ధ సెంచరీ పూర్తి చేయడానికి దగ్గరవుతున్న ఓపెనర్​ రహెనే(44)ను మిచెల్ శాంట్నర్‌ అవుట్​ చేశాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన బిల్లింగ్స్​(25) బ్రావో బంతికి అవుటయ్యాడు. కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​(20), జాక్సన్​(3) నాటౌట్​గా నిలిచారు. చెన్నై బౌలర్లలో బ్రావో మూడు వికెట్లు తీయగా.. శాంట్నర్‌ ఒక వికెట్​ పడగొట్టాడు.

అంతకు ముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టుకు ఆరంభంలోనే కోల్‌కతా షాక్‌ ఇచ్చింది. ఉమేశ్ యాదవ్‌ వేసిన తొలి ఓవర్లోనే సీఎస్​కే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (0) అవుటయ్యాడు. ఉమేశ్ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్​ ఐదో ఓవర్లో మరో ఓపెనర్‌ డెవాన్ కాన్వే (3).. శ్రేయస్ అయ్యర్‌కు చిక్కి పెవిలియన్‌ చేరాడు. రాబిన్ ఉతప్ప (28) నిలకడగా ఆడాడు. వరుణ్‌ చక్రవర్తి వేసిన చక్కటి బంతికి స్టంపౌటయ్యాడు. అనంతరం ఆ ఓవర్లోనే అంబటి రాయుడు కూడా రనౌటై.. క్రీజు వీడాడు. ఆండ్రీ రసెల్ వేసిన బంతికి శివమ్‌ దూబె (3).. సునీల్ నరైన్‌కు చిక్కాడు. దీంతో సగం ఓవర్లకే చెన్నై సగం వికెట్లు కోల్పోయినట్లయింది. కెప్టెన్​ రవీంద్ర జడేజా(26), ధోనీ(50) నాటౌట్​గా నిలిచారు. ఆఖర్లో ధోనీ సిక్స్​లు, ఫోర్లతో మెరిపించాడు. కోల్‌కతా బౌలర్లలో ఉమేశ్​ యాదవ్ రెండు వికెట్లు తీయగా​, రుసెల్, వరుణ్​ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు. ​

ఇదీ చదవండి: స్విస్​ ఓపెన్​.. ఫైనల్​కు చేరిన సింధు, ప్రణయ్​

ABOUT THE AUTHOR

...view details