IPL 2022: ఐపీఎల్ కొత్త జట్టు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్ తగిలింది. మోచేతి గాయం కారణంగా ఆ జట్టులోని ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టులో గతవారం వుడ్‌కు గాయం అయింది. ఈ మేరకు వుడ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు పంపించింది. మరి మార్క్ వుడ్‌కు బదులు తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.