IPL 2022 Delhi Capitals: తెలుగు పారిశ్రామికవేత్తకు చెందిన జీఎంఆర్ గ్రూప్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సొంతమైన దిల్లీ క్యాపిటల్స్‌కు యువ క్రికెటర్ రిషభ్ పంత్ నాయకుడు. ఈ సారి మెగా వేలంలో నాణ్యమైన ఆటగాళ్ల కోసం చాలా తెలివిగా ఖర్చు పెట్టింది. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు భారీ మొత్తం వెచ్చించింది. గత రెండు సీజన్‌లు తప్పించి అంతకుముందు వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్, సారథిగా ఫ్రాంచైజీకి టైటిల్‌ను అందించిన డేవిడ్ వార్నర్ (రూ.6.50 కోట్లు)ను ఈసారి దిల్లీ మంచి ధరకు సొంతం చేసుకొంది. అండర్ -19 ప్రపంచకప్ టైటిల్‌ను అందించిన యువ భారత్ సారథి యష్ ధుల్‌తో సహా స్పిన్నర్ విక్కీ ఓత్స్వాల్‌ను దిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసుకుంది.
బ్యాటింగ్‌లో వీరే కీలకం..
Delhi capitals batting order ipl 2022: బ్యాటింగ్‌పరంగా దిల్లీ క్యాపిటల్స్‌కు పెద్దగా ఇబ్బందులేమీ లేవు. అయితే విదేశీ ఆటగాళ్ల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. రిషభ్ పంత్, పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, కేఎస్ భరత్ కీలక ప్లేయర్లు. గత సీజన్ వరకు పృథ్వీషాకు తోడుగా శిఖర్ ధావన్ ఓపెనింగ్‌కు దిగేవాడు. ఈసారి ప్రమాదకర బ్యాటర్ డేవిడ్ వార్నర్ వచ్చేస్తాడు. వీరిద్దరూ కాసేపు నిలబడితే చాలు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ఆ తర్వాత రోవ్‌మన్ పావెల్ వచ్చే అవకాశం ఉంది. రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, అశ్విన్ హెబ్బర్/కేఎస్ భరత్/సీఫెర్ట్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ వరుసగా బ్యాటింగ్ చేయగలరు.
బౌలింగ్ దాడి సూపర్బ్..
Delhi capitals bowlers ipl 2022: దిల్లీ బౌలింగ్ దళం మాత్రం అద్భుతం. అంతర్జాతీయంగా పేసర్లు, స్పిన్నర్లతో ఎటాకింగ్‌గా ఉంది. ఆన్రిచ్ నార్జ్, లుంగి ఎంగిడి, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజర్ రెహ్మాన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, మిచెల్ మార్ష్, కమ్లేష్ నాగర్‌కోటి వంటి బౌలర్లు ఉండటం దిల్లీ క్యాపిటల్స్‌కు సానుకూలాంశం. తుది జట్టులో మాత్రం తప్పనిసరిగా నార్జ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శార్దూల్, ముస్తాఫిజర్/మిచెల్ మార్ష్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ పరంగా రిజర్వ్ బెంచ్ కూడా పటిష్టంగా ఉంది.