IPL 2022: ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. కొత్త ఫ్రాంఛైజీలైన లఖ్‌నవూ, అహ్మదాబాద్‌కు డెడ్‌లైన్ విధించింది. వేలానికి ముందు ఇరు జట్లు ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రకటన చేసిందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ పేర్కొన్నారు.
'అహ్మదాబాద్, లఖ్‌నవూ జట్లకు జనవరి 22 వరకు డెడ్‌లైన్ విధించాం. ఈలోపు తాము చెరో ముగ్గురు ఆటగాళ్లను(ఇద్దరు స్వదేశీ, ఓ విదేశీ) రిటైన్ చేసుకోవాలి.' అని బ్రిజేశ్ పటేల్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత ఫ్రాంఛైజీలకు మెయిల్ చేసినట్లు వెల్లడించారు.
ఫార్మల్ క్లియరెన్స్..
అయితే.. మంగళవారమే రెండు కొత్త ఫ్రాంఛైజీలకు అధికారిక అనుమతులు ఇచ్చింది బీసీసీఐ. ఐపీఎల్ పాలక మండలి సమావేశం అనంతరం లఖ్‌నవూ, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఫార్మల్ క్లియరన్స్ ఇచ్చినట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ తెలిపారు.
కాగా, ఐపీఎల్ మెగావేలం తేదీ కూడా ఖరారైనట్లు బ్రిజేశ్ స్పష్టం చేశారు. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.