Hardik pandya IPL: ఐపీఎల్లో ఈ సీజన్‌తో ఎంట్రీ ఇవ్వనున్న అహ్మదాబాద్ జట్టుకు 'గుజరాత్ టైటాన్స్' అని పేరు పెట్టారు. ఈ టీమ్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వహించనున్నాడు.
ఈ ఏడాది లీగ్‌లో అడుగుపెట్టిన కొత్త జట్లలో సీవీసీ గ్రూప్.. అహ్మదాబాద్ జట్టును రూ.5625 కోట్లకు కొనుగోలు చేసింది. సంజీవ్ గోయంకా ఆర్పీఎస్జీ.. లక్నో ఫ్రాంచైజీని రూ.7090 కోట్లకు సొంతం చేసుకుంది. వీటిలో లక్నో టీమ్‌కు 'లక్నో సూపర్‌జెయింట్స్' అని పేరు పెట్టగా, అహ్మదాబాద్ జట్టుకు 'గుజరాత్ టైటాన్స్' అని పేరు పెట్టారు.