రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు నికోలస్ పూరన్ బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపిన విధానంపై క్రికట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ప్రశంసలు కురిపించాడు. తన జీవితంలో తాను చూసిన అత్యుత్తమ ఫీల్డింగ్ అంటూ కితాబిచ్చాడు. అయితే దీనిపై పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ స్పందించాడు.
"క్రికెట్ దేవుడు సచిన్ మెచ్చుకున్నాక ఇందులో సందేహ పడాల్సిందేమీ లేదు. ఇదే అత్యుత్తమ ఫీల్డింగ్. అద్భుతంగా బంతి కోసం డైవ్ చేశావు నికోలస్ పూరన్. దీంతో పంజాబ్ ఫీల్డర్లలో స్పూర్తిని కలిగించావు. నేను చూసిన ఫీల్డింగ్‌లో ఇదే అత్యుత్తమం" అంటూ సచిన్ ట్వీట్‌కు బదులిచ్చాడు.
ఈ క్రమంలోనే పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ ట్వీట్‌కు స్పందించిన సచిన్.. మైదానంలో 30 యార్డ్ సర్కిల్లో అత్యుత్తమ ఫీల్డర్‌గా రోడ్స్‌ను పేర్కొన్నాడు.