ఈ ఐపీఎల్ మిడ్-సీజన్ బదిలీ ప్రక్రియలో భాగంగా ఎలాంటి కొత్త ఒప్పందాలు చేసుకోమని చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పారు. కొత్త ఆటగాళ్లని తీసుకోవడం లేదా తమ ఆటగాళ్లను వేరే ఫ్రాంచైజీకి బదిలీ చేసే ఉద్దేశం లేదని తెలిపారు. కనీసం ఆ ఆలోచన కూడా రాలేదని వెల్లడించారు.
ఈ సీజన్లో సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ తప్పుకున్న తర్వాత.. వారి స్థానాల్లో ఇతర ఆటగాళ్లను సీఎస్కే చేర్చుకోలేదు. మురళీ విజయ్, కేదార్ జాదవ్ లాంటి బ్యాట్స్మెన్ విఫలమవ్వడం వల్ల మిడ్-సీజన్ బదిలీ ప్రక్రియ ద్వారా కొంతమంది భారత ఆటగాళ్లను తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే విశ్వనాథన్ స్పష్టతనిచ్చారు.