తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ బ్యాటింగ్​ ఆర్డర్​పై సెహ్వాగ్​ సెటైర్లు - sehwag criticize dhoni batting order

ఈ ఐపీఎల్​లో చెన్నై జట్టు.. టెస్టు ఇన్నింగ్స్​ల్లా ఆడుతుందని అన్నాడు మాజీ క్రికెటర్ సెహ్వాగ్. ధోనీ నాలుగులో దిగేసరికి భారత్​లో బులెట్​ రైళ్లు పరుగెడతాయని కామెంట్ చేశాడు.

Virender Sehwag criticizes Dhoni for not batting at 4
ధోనీపై సెహ్వాగ్​ విమర్శలు

By

Published : Sep 27, 2020, 8:36 PM IST

ఈ ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్ కెప్టెన్ ధోనీ బ్యాటింగ్​ ఆర్డర్​పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోకి టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్​ చేరాడు. మహీపై హాస్యభరిత సెటైర్లు వేశాడు. అతడు నాలుగో స్థానంలో దిగాలని మనసు మార్చుకునే సరికి దేశంలో బులెట్​ రైళ్లు తిరుగుతాయని అన్నాడు.

"ఇంతమంది చెబుతున్నా ధోనీ, తన బ్యాటింగ్​ స్థానాన్ని మార్చుకోవట్లేదు. ఒకవేళ నాలుగో స్థానంలో రావాలని అతడు అనుకునేసరికి భారత్​లో బులెట్​ రైళ్లు కూడా వచ్చేస్తాయి. ధోనీసేన, టీ20 లీగ్​లో టెస్టులు ఆడుతున్నట్లు ఉంది. నేను వెళ్లి ఇక సినిమా చూసుకుంటా"

-సెహ్వాగ్​, టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​

ఐపీఎల్​ ప్రారంభమ్యాచ్​లో ముంబయి​పై గెలిచిన చెన్నై.. తర్వాత రాజస్థాన్​​, దిల్లీ జట్ల చేతిలో ఓడిపోయింది. ఈ మూడు మ్యాచుల్లోనూ ధోనీ లోయర్​ ఆర్డర్​లో బ్యాటింగ్​కు దిగి, సరిగా ఆడలేకపోయాడు. ఈ క్రమంలోనే చాలామంది మాజీలు సహా వీరేంద్ర సెహ్వాగ్​.. మహీని విమర్శిస్తునాారు.

ఇదీ చూడండి చెన్నై ట్విట్టర్​ను రైనా అన్​ఫాలో చేశాడా?

ABOUT THE AUTHOR

...view details