తెలంగాణ

telangana

ETV Bharat / sports

నటరాజన్.. సన్​రైజర్స్​కు దొరికిన ఆణిముత్యం! - నటరాజన్​పై మాజీల ప్రశంసలు

సన్​రైజర్స్​ హైదరాబాద్ ఈసారి తుదిపోరుకు చేరుకోలేకపోయినప్పటికీ​, జట్టులోని యువ ఆటగాళ్ల ప్రదర్శనకు మంచి మార్కులే పడ్డాయి. యార్కర్​ స్పెషలిస్టు టి.నటరాజన్​ తన బౌలింగ్​తో అందరి దృష్టిని ఆకర్షించాడు. పలువురు మాజీలు కూడా ఇతడు సన్​రైజర్స్​కు దొరికిన అద్భుత బౌలర్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

'T Natarajan is a find of this IPL'
'ఇలాంటి బౌలర్​ను మునుపెన్నడూ చూడలేదు'

By

Published : Nov 9, 2020, 4:17 PM IST

ఈసారి ఐపీఎల్​ ఫైనల్స్​కు సన్​రైజర్స్​ హైదరాబాద్​ అర్హత సాధించకపోవచ్చు. అందుకే కారణాలు ఏమైనా సరే.. ఈ సీజన్​లో హైదరాబాద్​ జట్టుకు అత్యద్భుతమైన బౌలర్ దొరికాడు. అతడే యార్కర్ల కింగ్ అని అభిమానులు ముద్దుగా పిలుస్తున్న లెఫ్ట్​ ఆర్మ్​ పేసర్​ టి.నటరాజన్​. అతడి ప్రదర్శన హైదరాబాద్​ ఫ్రాంచైజీనే కాదు బీసీసీఐ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించేలా చేసింది. త్వరలో నటరాజన్, టీమ్​ఇండియా తలుపు తట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఆదివారం క్వాలిఫైయర్​-2​లో ఓడిన హైదరాబాద్​ ఈ సీజన్​లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.అయితే నటరాజన్​ బౌలింగ్​ ప్రదర్శన పట్ల అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయని సహచర ఆటగాడు కేన్​ విలియమ్సన్​ చెప్పాడు. అతడికి ఐపీఎల్​ ఓ గొప్ప అవకాశమని కెప్టెన్​ డేవిడ్ వార్నర్​ తెలిపాడు.

టి.నటరాజన్​

నటరాజన్​పై మాజీల చూపు

తనదైన యార్కర్లతో యార్కర్​ స్పెషలిస్టుగా నటరాజన్​ పేరు తెచ్చుకున్నాడు. ఈ సీజన్​లో 16 మ్యాచ్​లాడి 16 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 10వ స్థానంలో నిలిచాడు. మొత్తంగా 377 బంతులు వేయగా.. 8.02 ఎకానమీతో 504 పరుగులను సమర్పించాడు. డెత్​ ఓవర్లలో తన యార్కర్​ బౌలింగ్​తో మాజీ క్రికెటర్లు తనవైపు చూసేలా చేశాడు.

ఇలాంటి యార్కర్లను చూడలేదు

"టీమ్​ఇండియాకు ఎంపిక కాని ఓ బౌలర్​ ఐపీఎల్​లో ఇలాంటి కచ్చితమైన యార్కర్లు వేయడం ఎప్పుడూ చూడలేదు" అని భారత మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్​ పఠాన్​ అన్నాడు.

ఇర్ఫాన్​ పఠాన్

గత శుక్రవారం జరిగిన ఎలిమినేటర్​ మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో సన్​రైజర్స్​ హైదరాబాద్​ తలపడింది. ఈ మ్యాచ్​లో కచ్చితమైన యార్కర్లతో డివిలియర్స్​నూ ఔట్ చేశాడు నటరాజన్​.

ABOUT THE AUTHOR

...view details