తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ వేలంలో హోల్డర్​ను తీసుకోకపోవడం ఆశ్యర్యమేసింది' - gambhir jason holder

2019 ఐపీఎల్​ వేలంలో సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఆల్​రౌండర్​ జాసన్​ హోల్డర్​ను ఎవరూ తీసుకోకపోవడం తనకెంతో ఆశ్చర్యమేసిందన్నాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ గంభీర్​. అతడు గొప్ప ఆటగాడని ప్రశంసించాడు.

auction'
హోల్డర్​

By

Published : Nov 9, 2020, 8:50 AM IST

ఈ ఏడాది ఐపీఎల్​ తొలి అర్ధ భాగంలో తేలిపోయినా.. రెండో అర్ధభాగంలో అదరగొట్టి ప్లేఆఫ్స్​కు చేరుకుంది సన్​రైజర్స్ హైదరాబాద్​. కానీ క్వాలిఫయర్​ 2లో మాత్రం ఇంటి ముఖం పట్టింది. అయితే ఈ ప్లేఆఫ్స్​కు చేరడానికి ముందు తన చివరి మూడు మ్యాచుల్లో పాయింట్ల పట్టికలో టాప్​లో ఉన్న జట్లను ఓడించింది. ఈ విజయాలలో ఆల్​రౌండర్​ జాసన్​ హోల్డర్​ పాత్ర ఎంతో కీలకమైనది. అటు బ్యాట్​తో.. ఇటు బంతితో రాణిస్తూ జట్టులో కీలక ఆడగాడిగా మారిపోయాడు. అయితే 2019లో జరిగిన ఐపీఎల్​ వేలంలో అతడిని ఎవరూ తీసుకోలేదు. ఆ తర్వాత జట్టులో మిచెల్​ మార్ష్​ గాయపడటం వల్ల అతడి స్థానంలోకి హోల్డర్​ వచ్చి... స్టార్​ ఆడగాడిగా మారిపోయాడు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్.. ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. గతేడాది జరిగిన వేలంలో హోల్డర్‌ను ఎవరూ తీసుకోకపోవడం వల్ల తాను ఎంతో ఆశ్చర్యపోయానని తెలిపాడు. ''హోల్డర్ లాంటి ఆల్‌రౌండర్‌ను వేలంలో ఎవరూ తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. జిమ్మీ నీషమ్‌, క్రిస్ మోరిస్‌ను తీసుకున్నారు. ఇతర ఆల్‌రౌండర్స్‌ను తీసుకున్నారు. కానీ రెండు ఫార్మట్లు ఆడే హోల్డర్‌పై ఎవరూ ఆసక్తి చూపించలేదు. ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం అతడికి ఉంది. ఒత్తిడిలో రాణించగల సత్తా ఉంది. అందుకే సన్‌రైజర్స్ జట్టుకు మంచి మ్యాచ్ ఫినిషింగ్ అందించాడు.'' అని గంభీర్​ అన్నాడు.

ఈ ఐపీఎల్​లో 7 మ్యాచ్‌లు ఆడిన హోల్డర్.. 16.35 సగటుతో 14 వికెట్లు తీశాడు. బ్యాటింగ్, బౌలింగ్​తో అదరగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ​ కీలక సమయంలో విలువైన పరుగులు చేసి.. జట్టుకు పలు విజయలను అందించాడు.

ఇదీ చూడండి : ఆసీస్​ పర్యటనకు దూరమైన సాహా..?

ABOUT THE AUTHOR

...view details