రాజస్థాన్‌పై హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మనీశ్ పాండే చెలరేగడం వల్ల లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలుండగానే పూర్తి చేసింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుని, ఫ్లేఆఫ్ అవకాశాల్ని మెరుగుపరుచుకుంది.
155 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన హైదరాబాద్.. మూడు ఓవర్లలోపే ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో వికెట్లో కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే (83), విజయ్ శంకర్(52) సంయమనంతో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ప్రత్యర్థి బౌలర్లకు వికెట్ తీసే అవకాశం ఇవ్వకుండా లాంఛనాన్ని పూర్తి చేశారు. రాజస్థాన్ బౌలర్ ఆర్చర్‌కు రెండు వికెట్లు దక్కాయి.