హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ 163 పరుగులు చేయడం వల్ల మ్యాచ్ టైకి దారితీసింది.. ఆపై హైదరాబాద్ సూపర్ ఓవర్‌లో రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కారణంగా కోల్‌కతా సునాయాసంగా విజయం సాధించింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మూడు పరుగులు తీయడం ద్వారా మోర్గాన్ టీమ్ ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసింది.
కోల్‌కతా నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ తొలుత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులే చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(47 నాటౌట్; 33 బంతుల్లో 5x4), అబ్దుల్ సమద్(23; 15 బంతుల్లో 2x4, 1x6) రాణించినా ఫలితం లేకుండా పోయింది. అయితే, ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో(36; 28 బంతుల్లో 7x4), కేన్ విలియమ్సన్(29; 19 బంతుల్లో 4x4, 1x6) మెరుపు ఓపెనింగ్ ఇచ్చారు. వీరిద్దరూ 6 ఓవర్లకు 57 పరుగులు చేశారు. దీంతో హైదరాబాద్ సునాయాసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ, అక్కడి నుంచే వార్నర్ టీమ్ వికెట్లు కోల్పోవడం ప్రారంభమైంది. ఫెర్గూసన్ 3/15తో మెరవడం వల్ల తొలుత విలియమ్సన్ ఔటవ్వగా కాసేపటికే ప్రియమ్ గార్గ్(4), మనీష్ పాండే(6), విజయ్ శంకర్(7) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. చివర్లో వార్నర్, సమద్ బాధ్యతాయుతంగా ఆడి జట్టును గెలిపించేలా కనిపించారు. కానీ ఇన్నింగ్స్ చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన వేళ వార్నర్ ఒకే పరుగు తీయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.