తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ జాబితాలో రోహిత్​ను దాటేసిన ధావన్ - ఐపీఎల్​లో ధావన్ రిాకర్డు

సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్​లో దిల్లీ బ్చాట్స్​మన్ శిఖర్ ధావన్ 78 పరుగులతో సత్తాచాటాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్​లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్​మెన్ జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు.

Shikhar Dhawan hits 1st 50 in playoff game, surpasses his highest run tally in single-season
ఆ జాబితాలో రోహిత్​ను దాటేసిన ధావన్

By

Published : Nov 9, 2020, 5:30 AM IST

సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ 78 పరుగులతో సత్తాచాటాడు. అలాగే ఈ సీజన్​లో 600 పరుగుల మార్కును అధిగమించాడు. దీంతో పాటే లీగ్​లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్​మెన్ జాబితాలో రోహిత్ శర్మను దాటేశాడు.

ప్రస్తుతం ధావన్ ఐపీఎల్​లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్​మెన్ జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. 175 మ్యాచ్​ల్లో 5,182 పరుగులు సాధించాడు. ఇతడి తర్వాత ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ 5,162 పరుగులతో ఐదో స్థానానికి పడిపోయాడు. బెంగళూరు సారథి కోహ్లీ 5,878 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ మ్యాచ్​లో దిల్లీ విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో గెలిచి ఐపీఎల్​లో తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ముంబయితో జరిగే తుదిపోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.

ABOUT THE AUTHOR

...view details