షార్జా వేదికగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో.. ఐదింటిలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ఆరు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న దిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలబలాలపై ఓ లుక్కేద్దాం. ఈ మ్యాచ్ నేడు రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది.
మరో విజయాన్ని ఖాతాలో వేసుకునేందుకు
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో పదమూడు పరుగుల తేడాతో విజయం సాధించింది దిల్లీ క్యాపిటల్స్. బ్యాటింగ్ లైనప్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. పర్వాలేదనిపిస్తున్న పృథ్వీషా, అజింక్యా రహానె మాత్రం ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. దిల్లీకి చెందిన బౌలర్లు అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా వారం రోజులు అందుబాటులో ఉండకపోవచ్చు. బౌలింగ్ లైనప్‌లో కగిసో రబాడా, రవిచంద్రన్ అశ్విన్, ఎన్రిచ్ నోకియా, మార్కస్ స్టోయినిస్ మెరుగ్గా రాణిస్తున్నారు. పంత్ స్థానంలో మరొకరికి స్థానం ఇవ్వడం మినహా దిల్లీ క్యాపిటల్స్‌లో మార్పులేవీ జరగకపోవచ్చు. మొత్తంగా గట్టి ఫామ్‌లో ఉన్న దిల్లీ ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది.
గెలవాలనే కసితో