తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ- పాంటింగ్​ 'వార్​'పై అశ్విన్​ క్లారిటీ - విరాట్​ కోహ్లీ వార్తలు

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగుళూరు, దిల్లీ క్యాపిటల్స్​ జట్ల మధ్యలో రెండో లీగ్​ మ్యాచ్​లో విరాట్​ కోహ్లీ, రికీ పాంటింగ్​ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. సోషల్​మీడియాలో ఈ వీడియో వైరల్​ అయ్యింది. దీనిపై దిల్లీ క్యాపిటల్స్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ తాజాగా స్పష్టతనిచ్చాడు.

Ravichandran Ashwin explains what happened between Virat Kohli and Ricky Ponting heated argument
కోహ్లీ, పాంటింగ్​ మాటల యుద్ధంపై అశ్విన్​ క్లారిటీ

By

Published : Nov 12, 2020, 9:27 PM IST

అబుదాబి వేదికగా బెంగుళూరు, దిల్లీ జట్లు లీగ్‌ దశలో రెండోసారి తలపడిన సందర్భంగా విరాట్‌ కోహ్లీ, రికీ పాంటింగ్‌ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం వల్ల అసలేం జరిగిందనే విషయంపై దిల్లీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తాజాగా స్పష్టతనిచ్చాడు. బుధవారం తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ ఆ వివరాలను వెల్లడించాడు.

"ఆరోజు మ్యాచ్‌ ఆడేటప్పుడు నా వెన్నెముకలో నొప్పిగా అనిపించింది. అప్పటికే ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయడం వల్ల గాయమైందని తేలింది. నాలుగు ఓవర్లు బౌలింగ్‌ పూర్తి చేశాక డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లాను. దాంతో బెంగళూరు టీమ్‌ ఏమనుకుందంటే.. నేను నాలుగు ఓవర్లు వేశాక వెళ్లిపోయానని అనుకున్నారు. అలా ఎలా చేస్తారని అడిగారు. అయితే, పాంటింగ్‌ గురించి మనందరికీ తెలిసిందే. అతడు సై అంటే సై అంటాడు. అస్సలు వెనక్కి తగ్గడు. ఇక బెంగళూరు అలా అడిగేసరికి మేమలా మోసం చేయట్లేదు. గాయం కారణంగా నొప్పి రావడం వల్లనే వెళ్లిపోయానని చెప్పాడు."

- రవిచంద్రన్​ అశ్విన్​, టీమ్​ఇండియా క్రికెటర్​

కాగా, ప్లేఆఫ్స్‌లో రెండో స్థానంలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరుపై దిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(29)ని అశ్విన్‌ ఔట్‌చేశాడు. అనంతరం దిల్లీ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో శ్రేయస్‌ టీమ్‌ ప్లేఆఫ్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఇక కోహ్లీని ఔట్‌ చేయడంపై స్పందించిన అశ్విన్‌.. తానెప్పటికీ బెంగళూరు సారథికి బౌలింగ్‌ చేయడం ఇష్టపడతానని చెప్పాడు. తనపై ఆధిపత్యం చెలాయించడానికి విరాట్‌ అవకాశాలు తీసుకోడని, తన వికెట్‌ ఇవ్వడానికి ఇష్టపడడని పేర్కొన్నాడు. అదొక గర్వకారణమైన విషయమని తెలిపాడు. ధోనీ కూడా అలాగే భావిస్తాడన్నాడు.

ABOUT THE AUTHOR

...view details