ఐపీఎల్లో సునీల్ నరైన్‌ను అనుమానాస్పద బౌలింగ్ జాబితా నుంచి తొలగించారు. అతడిపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఐపీఎల్ కమిటీ.. ఈ విషయంలో క్లీన్ చిట్ ఇచ్చింది.
అబుదాబిలో అక్టోబరు 10న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ బౌలింగ్ అనుమానాస్పదంగా ఉందని ఫీల్డ్ అంపైర్లు.. ఐపీఎల్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఓవర్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీని కమిటీకి పంపించింది కోల్‌కతా ఫ్రాంచైజీ. దానిని ఆసాంతం పరిశీలించి, నరైన్ బౌలింగ్‌లో అనుమానం ఏం లేదని తేల్చారు. ఫలితంగా సీజన్‌లోని తర్వాత మ్యాచ్‌ల్లో ఆడనున్నాడీ బౌలర్. 2014లోనూ ఇదే తరహాలో నిషేధానికి గురై కొన్నాళ్ల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు నరైన్.