దిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. 111 పరుగుల లక్ష్యాన్ని 14.2 ఓవర్లలోనే ఛేదించి 9 వికెట్ల తేడాతో గెలిచింది. ఇషాన్ కిషన్ 72 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
దిల్లీపై ముంబయి ఘనవిజయం
18:26 October 31
18:20 October 31
ఛేదనలో ధాటిగా ఆడిన ముంబయి ఇండియన్స్.. 13 ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. విజయానికి 42 బంతుల్లో 16 పరుగులు కావాలి.
18:19 October 31
లక్ష్యాన్ని నెమ్మదిగా కరిగిస్తోంది ముంబయి. ఓపెనర్లు డికాక్ (16), ఇషాన్ కిషన్ (22) ఆచితూచి ఆడుతూ పరుగులు సాధిస్తున్నారు. ప్రస్తుతం 6 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది.
17:29 October 31
నెమ్మదిగా ఆడుతోన్న ముంబయి
111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి 7 పరుగులు చేసింది. డికాక్ (6), ఇషాన్ (1) క్రీజులో ఉన్నారు.
17:04 October 31
చెలరేగిన ముంబయి బౌలర్లు.. దిల్లీ 110కి పరిమితం
ముంబయితో జరుగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. ముంబయి బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. ఫలితంగా శ్రేయస్ అయ్యర్ (25), పంత్ (21) మినహా మరెవరూ ఎక్కవసేపు క్రీజులో నిలవలేదు. ధావన్ (0), పృథ్వీ షా (10), స్టోయినిస్ (2) పూర్తిగా నిరాశపర్చారు. దీంతో దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లో బుమ్రా, బౌల్ట్ చెరో మూడు వికెట్లతో సత్తాచాటగా కౌల్టర్‌నీల్, చాహర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
16:59 October 31
దిల్లీ తడబడుతోంది. ప్రస్తుతం 18.1 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.
16:50 October 31
కష్టపడుతోన్న దిల్లీ
16 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది దిల్లీ. ప్రవీణ్ దూబే (1), అశ్విన్ (8) క్రీజులో ఉన్నారు.
16:28 October 31
చెలరేగుతున్న ముంబయి బౌలర్లు
దిల్లీ బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. ముంబయి బౌలర్లు తమ బౌలింగ్‌తో చెలరేగిపోతున్నారు. చక్కని లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ దిల్లీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నారు. పంత్ (21), శ్రేయస్ అయ్యర్ (25) కాసేపు నిలకడగా ఆడినా ముంబయి బౌలర్లు వీరిని నిలదొక్కుకోనివ్వలేదు. స్టోయినిస్ కూడా రెండు పరుగులే చేసి ఔటయ్యాడు. దీంతో ప్రస్తుతం 12 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది దిల్లీ.
16:02 October 31
కట్టుదిట్టంగా ముంబయి బౌలింగ్
దిల్లీ బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు ముంబయి బౌలర్లు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కట్టడి చేస్తున్నారు. ధావన్(0)తో పాటు 10 పరుగులు చేసిన తర్వాత మరో ఓపెనర్ పృథ్వీ షా కూడా పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం 8 ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. పంత్ (6), శ్రేయస్ (21) క్రీజులో ఉన్నారు.
15:38 October 31
నెమ్మదిగా ఆడుతోన్న దిల్లీ
ముంబయితో జరుగుతోన్న మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తోన్న దిల్లీ నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం రెండు ఓవర్లకు వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది దిల్లీ. పృథ్వీ (2), శ్రేయస్ (4) క్రీజులో ఉన్నారు.
15:08 October 31
జట్లు
దిల్లీ క్యాపిటల్స్
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్, హెట్మెయర్, స్టోయినిస్, హర్షల్ పటేల్, రబాడ, రవిచంద్రన్ అశ్విన్, ప్రవీణ్ దూబే, ఎన్రిచ్ నోకియా
ముంబయి ఇండియన్స్
డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, కృనాల్ పాండ్యా, పొలార్డ్ (కెప్టెన్), కౌల్టర్‌నీల్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, బౌల్ట్, బుమ్రా
14:41 October 31
దిల్లీ బ్యాటింగ్
ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ముంబయి ఇండియన్స్.. దానికి అడుగు దూరంలో ఉన్న దిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు (శనివారం) మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌ల్లో గెలిచి ముంబయి దూకుడుగా ఉండగా, హ్యాట్రిక్ ఓటములతో డీలా పడింది దిల్లీ. ఈ రెండు జట్లు తలపడుతోన్న మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కూ రోహిత్ దూరమయ్యాడు.