తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముంబయి జోరును రాజస్థాన్​ అడ్డుకోగలదా? - ఐపీఎల్​ 13 అప్​డేట్స్​

ఫుల్​ జోష్​తో ఉన్న ముంబయి​, పరాజయాలతో సతమతమవుతున్న రాజస్థాన్​.. ఆదివారం తలపడనున్నాయి. భారత కాలమాన ప్రకారం రాత్రి 7.30గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది.

Mumbai Indians
ముంబయి ఇండియన్స్​

By

Published : Oct 25, 2020, 8:45 AM IST

అబుదాబి వేదికగా మరో రసవత్త పోరుకు రంగం సిద్ధమైంది. పది మ్యాచుల్లో ఏడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్.. ఏడింటిలో ఓడి, ఏడో స్థానంలో ఉన్న రాజస్థాన్​ రాయల్స్​ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్​లో గెలిచి, జోరును కొనసాగించాలని రోహిత్​ సేన, ప్లే ఆఫ్స్​ అవకాశాలను పదిలం చేసుకోవాలని(కనీసం రన్​రేట్​ను మెరుగుపరుచుకోనైనా) స్మిత్​ బృందం పట్టుదలతో ఉన్నాయి. మరి ఎవరు గెలుస్తోరో?

ఫామ్ కొనసాగిస్తే విజయమే!

గత మ్యాచ్​లో కెప్టెన్ రోహిత్​ లేకుండానే బరిలో దిగిన ముంబయి.. చెన్నైపై సునాయస విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు ఇషాన్ కిషాన్​, డికాక్ మ్యాచ్​ను ముగించేశారు. మిడిలార్డర్​లో సూర్యకుమార్​ యాదవ్​(243), హార్దిక్​ పాండ్య(164), పొలార్డ్​(208), కృనాల్​ పాండ్య(82) ఇప్పటికే ఫామ్​లో ఉన్నారు. జట్టు విజయాల్లో కీలకపాత్ర వహిస్తున్నారు. బౌలింగ్​ విభాగంలో​ బౌల్ట్, బుమ్రా​ అద్భుతంగా రాణిస్తున్నారు. కౌల్టర్​ నైల్​, కృనాల్​, చాహర్ కూడా బాగా​నే ఆడుతున్నారు. ఇదే ఫామ్​ను కొనసాగిస్తే రాయల్స్​పై గెలుపు నల్లేరపై నడకే.

ఏమో చెప్పలేం

లీగ్​ ప్రారంభంలో గెలిచినప్పటికీ.. ఆ తర్వాత నిలకడలేని ప్రదర్శన చేస్తూనే ఉంది రాజస్థాన్​. ​స్టోక్స్​(110), శాంసన్​(272), బట్లర్​(271) లాంటి స్టార్​ ఆటగాళ్లు ఉన్నాసరే గెలవలేకపోతోంది. మిడిల్ ఆర్డర్​ సమస్య వెంటాడుతోంది. ఆల్​రౌండర్​ రాహుల్ తివాతియా(224, 7వికెట్లు) బ్యాటింగ్​, బౌలింగ్​లోనూ బాగానే రాణిస్తున్నా అతడికి సహకారం అందట్లేదు. బౌలర్లలోనూ నిలకడ లోపిస్తోంది.

ఆర్చర్​(15) వికెట్లు బాగానే తీస్తున్నా.. కార్తీక్​ త్యాగి, ఉనద్కత్​, అంకిత్​ రాజ్​పుత్​ నుంచి సహకారం లభించట్లేదు. వీళ్లు మెరుగ్గా ఆడాల్సి ఉంది. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్​లో అదృష్టం కలిసొచ్చి రన్​రేట్​ మెరుగై, అవతలి జట్లు చిత్తుగా ఓడిపోతే.. పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకి ప్లే ఆఫ్స్​కు వెళ్లే అవకాశం ఉంది. లేదంటే అంతే!

జట్లు (అంచనా)

ముంబయి: డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రోహిత్​ శర్మ(సారథి), హార్దిక్ పాండ్య, పొలార్డ్ , కృనాల్ పాండ్య, కౌల్టర్​నీల్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా

రాజస్థాన్​​ : బట్లర్​, స్టోక్స్​, సంజూ శాంసన్​, కార్తిక్​ త్యాగి, స్మిత్​ (కెప్టెన్​), శ్రేయస్​ గోపాల్​, రాహుల్​ తెవాతియా, జయదేవ్​ ఉనద్కత్, రియాన్​ పరాగ్​, రాబిన్​ ఉతప్ప, జోఫ్రా ఆర్చర్​

ఇదీ చూడండి'గేల్ చాలా స్మార్ట్.. అతడుంటే ఎనర్జీ పక్కా'

ABOUT THE AUTHOR

...view details