తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ తర్వాత బిగ్​బాష్​ లీగ్​​లో ధోనీ?

ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియా టీ20 లీగ్​లో ధోనీ ఆడనున్నాడని సమాచారం. ఇతడితే పాటే యువరాజ్ సింగ్, రైనా కూడా అందులో పాల్గొనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత?

MS Dhoni
ధోనీ

By

Published : Oct 23, 2020, 5:45 PM IST

చెన్నై సూపర్​ కింగ్స్​ సారథి ధోనీ.. ఈ సీజన్​తో ఐపీఎల్​ కెరీర్​కు రిటైర్మెంట్​ ప్రకటించనున్నాడా? ఇకపై ఈ సీజన్​ నుంచి బిగ్​ బాష్​ లీగ్(బీబీఎల్​)​లో ఆడనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్​ వర్గాలు.

ఈ ఏడాది బీబీఎల్​​లో విదేశీ ఆటగాళ్ల సంఖ్యను రెండు నుంచి మూడుకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్లు ధోనీ, సురేశ్​ రైనా, యువరాజ్​ సింగ్​ లాంటి ఆటగాళ్లపై అక్కడి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయట. తమ జట్లు మరింత బలంగా తయారవ్వడం సహా బ్రాండ్​ విలువను పెంచుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారట.

నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిందే

యువరాజ్​ సింగ్​ మినహా ధోనీ, రైనా ఐపీఎల్​లో భాగస్వాములే. లీగ్​ కెరీర్​కు యువీ రిటైర్మెంట్​ ప్రకటించగా.. ధోనీ ప్రస్తుతం ఆడుతున్నాడు. రైనా వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీజన్​కు దూరమయ్యాడు. అయితే ఈ ముగ్గురు బీబీఎల్​లో​ ఆడాలంటే బీసీసీఐ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. మరి వీరు బిగ్​బాష్​లో ఆడటానికి ఆసక్తి చూపిస్తారా? లేదా? ఒకవేళ ఆడాలనుకుంటే భారత క్రికెట్​ బోర్డు వీరికి అనుమతిస్తుందా? అనేది వేచి చూడాలి.

బీబీఎల్​లో ఆడటంపై ధోనీ ఏమన్నాడంటే?

ఆస్ట్రేలియా దేశవాళీ విధానం పకడ్బందీగా ఉంటుందని.. సామర్థ్యమైన క్రికెటర్లను తయారుచేస్తుందని ధోనీ 2016లో అన్నాడు. అయితే బిగ్‌బాష్‌ లీగ్‌ విషయమై ఆ సమయంలో ఎలాంటి ఆలోచనా లేదని చెప్పాడు. రిటైర్మెంట్​ తీసుకున్న తర్వాత ఫిట్‌నెస్‌ ఉంటే దీని గురించి ఆలోచిస్తానని తెలిపాడు.

ఈ ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు ధోనీ. ఈ సీజన్​ తర్వాత ఐపీఎల్​కు కూడా వీడ్కోలు చెబుతాడనే​ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ధోనీ బీబీఎల్​లో ఆడతాడనే అంశం తెరపైకి వచ్చింది.

ఇదీ చూడండి నా కల నిజమైంది.. ఈటీవీ భారత్​తో రవి బిష్ణోయ్​

ABOUT THE AUTHOR

...view details