ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికి అభిమానులకు షాక్ ఇచ్చాడు టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ. ఆ తరుణంలో అందరూ అతడి ఐపీఎల్ ప్రదర్శనపైనే ఎక్కువ ఆసక్తి చూపించారు. ఈ సీజన్లో మళ్లీ పాత ధోనీని చూస్తామని ఆశించారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో పాటు ధోనీ ఈ లీగ్‌లో దారుణంగా విఫలమవుతున్నారు. తను తీసుకునే నిర్ణయాలు కొన్ని మ్యాచ్‌ల్ని ఓటమిపాలు చేస్తున్నాయి. తాజాగా ఈ విషయమై స్పందించాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మియాందాద్. ధోనీ బౌతికంగా ఫిట్‌గా ఉన్నా అది క్రికెట్ ఆడటానికి సరిపోదని వ్యాఖ్యానించాడు.
"మన వయసుతో పాటు శరీర సామర్థ్యం మారుతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఫిట్నెస్ తగ్గుతూ వస్తుంది. హై లెవల్లో మళ్లీ ధారుడ్యం సంపాదించాలంటే చాలా శ్రమించాలి. ధోనీ భౌతికంగా చాలా దృఢంగా ఉన్నాడు. కానీ అది మ్యాచ్‌కు తగినంత ఫిట్ కాదు. కొన్ని షాట్స్ ఆడలేకపోతున్నాడు. శారీరక శ్రమతో పాటు ధోనీ బ్యాటింగ్ టెక్నిక్‌పై నెట్స్‌లో మరింత శ్రమించాలి. ఒకవేళ అతడు 5 రౌండ్ల పరుగు చేస్తుంటే దానిని 8 రౌండ్లకు పెంచాలి. బ్యాటింగ్ ప్రాక్టీస్ గంట చేస్తుంటే దానిని రెండు గంటలకు పెంచాలి."