వరుస విజయాలతో దూసుకెళ్తున్న పంజాబ్ జట్టు.. పట్టికలో అట్టడుగున, ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం పోరాడుతోన్న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఐపీఎల్ రెండో భాగంలో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి, ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తున్న పంజాబ్.. శుక్రవారం జరిగే ఈ మ్యాచ్‌లో ఏం చేస్తుందో అనేది ఆసక్తికరం. స్టోక్స్, శాంసన్ మెరుపు ఇన్నింగ్స్‌తో గాడిలోపడ్డ రాజస్థాన్ ముందుకెళ్తుందా? లేదా ఇంటిబాట పడుతుందా? అనేది కీలకంగా మారింది.
రాజస్థాన్ vs పంజాబ్ మ్యాచ్ పంజాబ్ విజయభేరి కొనసాగేనా?
కేఎల్ రాహుల్ ఆధ్వర్యంలో పంజాబ్ జట్టు విజయపరంపర కొనసాగిస్తోంది. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి.. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. గేల్ రాకతో మరింత దృఢంగా కనిపిస్తున్న పంజాబ్.. ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మయాంక్ అగర్వాల్ గాయాల కారణంగా చివరి రెండు మ్యాచ్‌లు అందుబాటులో లేడు. అతడి స్థానాన్ని భర్తీ చేసిన మన్దీప్ సింగ్ ఓపెనర్‌గా బాగానే ఆడాడు. బౌలింగ్‌లో కాస్త బలహీనంగా ఉన్న పంజాబ్ ప్రస్తుతం మంచిగానే ఆడుతోంది. చివరి ఐదు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేయగలగడమే ఇందుకు ఉదాహరణ.
పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 'రాయల్'గా ఆడలేకపోతోంది!
పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న రాజస్థాన్‌కు అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం కనిపించట్లేదు. 12 మ్యాచ్‌ల్లో కేవలం 5 మాత్రమే గెలిచిన రాజస్థాన్‌కు ఇందులో గెలిచినా ప్లే ఆఫ్స్ అవకాశాలు క్లిష్టంగానే ఉన్నాయి. ఒకవేళ పంజాబ్ చేతిలో ఓడితే రాజస్థాన్ ఇంటి బాట పట్టిన రెండో జట్టు అవుతుంది.
గత మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయిని చిత్తు చేసిన రాజస్థాన్.. ఆత్మస్థైర్యంతో కనిపిస్తోంది. అదే జోరు ఈ మ్యాచ్‌లోనూ చూపిస్తే పంజాబ్ ఆశలు పటాపంచలైనట్లే. బౌలింగ్‌లో జోఫ్రా అర్చర్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టిస్తున్నాడు. పంజాబ్‌తో పోల్చితే.. రాజస్థాన్ బౌలింగ్ కాస్త బలంగానే ఉంది.
రాజస్థాన్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జట్ల (అంచనా)
పంజాబ్: కేఎల్ రాహుల్(సారథి), మన్దీప్ సింగ్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్, దీపక్ హోడా, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్
రాజస్థాన్: రాబిన్ ఉతప్ప, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, బట్లర్, స్మిత్ (సారథి), రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, అంకిత్ రాజ్‌పూత్, కార్తీక్ త్యాగి