వరుస విజయాలతో జోష్ మీదున్న ముంబయి ఇండియన్స్ జట్టుతో తలపడనుంది కోల్‌కతా నైట్ రైడర్స్. చివరి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో 82 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన కోల్‌కతా వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన ముంబయ్‌పై విజయం సాధించి గాడిన పడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి 7.30 గం. ప్రారంభంకానుంది.
నిలకడగా ముంబయి
కెప్టెన్ రోహిత్ శర్మతో(216 పరుగులు) పాటు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్(191 పరుగులు), సూర్య కుమార్ యాదవ్(233 పరుగులు) టోర్నీలో నిలకడగా రాణిస్తున్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ హార్ధి పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా కూడా మంచి ఫామ్‌లోనే ఉండడం వల్ల ముంబయికి మరింత బలం చేకూరుతోంది.
బౌలర్లు బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ముంబయి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు ఆస్ట్రేలియా ఆటగాడు జేమ్స్ ప్యాటిన్సన్ చెలరేగుతున్నాడు. బౌలింగ్ పరంగా జట్టుకు చేయూతనిస్తోన్న ఈ ముగ్గురు ఇప్పటివరకు 31 వికెట్లు తీయడం విశేషం.
యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జట్టు విజయం కోసం విఫలయత్నం చేశాడు. చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నా స్థిరంగా రాణించాల్సి ఉంది. స్పిన్నర్లు రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యా కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేయాలని చూస్తున్నారు.
బౌలింగ్‌లో తడబడుతోన్న కోల్‌కతా
అనుమానాస్పద బౌలింగ్ శైలి కారణంగా స్పిన్నర్ సునీల్ నరైన్ ఈ మ్యాచ్‌లో ఉంటాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆల్ రౌండర్ ఆండ్రూ రసెల్ కూడా ఉత్తమ ప్రదర్శన కనబర్చడంలో విఫలమౌతున్నాడు. జట్టులో ముఖ్యమైన బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్, మోర్గాన్, నితీశ్ రానా, దినేశ్ కార్తీక్ ఉన్నా కీలక మ్యాచ్‌ల్లో వారి ప్రదర్శన పేలవంగానే ఉంది.
పంజాబ్, చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్‌ల్లో కోల్‌కతా బౌలర్లు చక్కటి ప్రదర్శనతో జట్టుకు విజయాన్నందించారు. ఇదే జోరు ముంబయితో కూడా కొనసాగిస్తే కోల్‌కతా ఆట తీరు మారే అవకాశం ఉంటుంది. శుక్రవారం జరగనున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ కుల్దీప్ యాదవ్‌ని జట్టులోకి తీసుకునే వీలుంది.
జట్లు:
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఆదిత్యా తారే, అన్మోల్ ప్రీత్ సింగ్, అనుకుల్ రాయ్, క్రిస్ లిన్, ధావల్ కులకర్ణి, దిగ్విజయ్ దేశ్‌ముఖ్, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, జేమ్స్ ప్యాటిన్సన్, జస్ప్రిత్ బుమ్రా, జయంత్ యాదవ్, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, మిచెల్ మెక్క్లెనగాన్, మోహ్సిన్ ఖాన్, కౌల్టర్ నీల్, ప్రిన్స్ బల్వంత్ రాయ్, క్వింటన్ డికాక్, రాహుల్ చాహర్, సౌరబ్ తివారి, రూతర్ఫోర్డ్, సూర్య కుమార్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్.
కోల్‌కతా నైట్ రైడర్స్:దినేశ్ కార్తీక్(కెప్టెన్), ఇయాన్ మోర్గాన్, నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, రింకూ సింగ్, శుభ్‌మన్ గిల్, సిద్దేశ్ లాడ్, అలీ ఖాన్, కమలేష్ నాగర్కోటి, కుల్దీప్ యాదవ్, ఫెర్గూసన్, పాట్ కమిన్స్, ప్రసిద్ధ్ క్రిష్ణ, సందీప్ వారియర్, శివం మావి, వరుణ్ చక్రవర్తి, అండ్రూ రసెల్, ఎమ్ సిద్ధార్థ్, సునీల్ నరైన్, నిఖిల్ నాయక్, టామ్ బాంటన్.
ఇదీ చదవండి:'తాహిర్.. రియల్ ఛాంపియన్ ఆఫ్ క్రికెట్'