బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ విధ్వంసక బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే రెండు రికార్డులను నమోదు చేశాడు. కేవలం 69 బంతుల్లో 132 (14 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులు చేసి.. ఈ సీజన్లో తొలి సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మరో రికార్డును సృష్టించాడు.
ఐపీఎల్లో సచిన్ రికార్డు అధిగమించిన రాహుల్
ఆర్సీబీతో మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండు రికార్డులు సాధించాడు. ప్రస్తుత సీజన్లో తొలి సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా.. తక్కువ సమయంలో 2 వేల పరుగుల పూర్తి చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు.
సెంచరీతో చెలరేగిన రాహుల్.. ఐపీఎల్లో 2 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టోర్నీలో ఈ ఘనతను వేగంగా చేరుకున్న భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గతంలో ముంబయి ఇండియన్స్ ఆటగాడు సచిన్ (63 ఇన్నింగ్స్) రికార్డును రాహుల్ (60 ఇన్నింగ్స్) అధిగమించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 206 పరుగులు చేసింది. ఛేదనలో బెంగళూరు 17 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. పంజాబ్ తర్వాతి మ్యాచ్‌ను రాజస్థాన్‌తో(సెప్టెంబరు 27న), ఆర్సీబీ ముంబయి ఇండియన్స్‌తో(సెప్టెంబరు 28న) తలపడనుంది.