రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌ల జెర్సీలపై పేర్లు మారిపోయాయి. విరాట్ జెర్సీపై సిమ్రాన్‌జీత్ సింగ్ అని, ఏబీ చొక్కాపై రితోష్ పంత్ అని కనిపించింది. అయితే ఈ మార్పు ట్విట్టర్ వరకే. కరోనా యోధుల గౌరవ సూచకంగా ఆర్సీబీ నిర్వహిస్తున్న 'మై కొవిడ్ హీరోస్' కార్యక్రమంలో భాగంగా వైరస్‌పై పోరాటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న వారి పేర్లతో విరాట్, ఏబీ జెర్సీలు ధరించి ఫొటోలు దిగారు. వాటినే డిస్‌ప్లే ఫొటోలుగా పెట్టారు. కానీ, ఆ జెర్సీలనే మ్యాచ్‌లో ధరించలేదు.
'మై కొవిడ్ హీరోస్' సోషల్‌మీడియాకే పరిమితమా? - virat kohli
లాక్డౌన్ కాలంలో వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టిన వారికి సంఘీభావంగా తమ జెర్సీలపై 'మై కొవిడ్ హీరోస్' అని ప్రదర్శించారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు. ఈ కార్యక్రమంలో భాగంగా వైరస్‌పై పోరాటంలో తమ వంతుగా సేవ చేసిన వారి పేర్లతో విరాట్, ఏబీ డివిలియర్స్ జెర్సీలు ధరించి ఫొటోలు దిగి.. వాటినే వారి సోషల్‌మీడియా డీపీలుగా పెట్టారు. అయితే ఈ మార్పు ట్విట్టర్‌కే పరిమితం.
'మై కొవిడ్ హీరోస్' సోషల్‌మీడియాకే పరిమితమా?
వినికిడి లోపం ఉన్న సిమ్రాన్‌జీత్ సింగ్ ఈ మహమ్మారి కారణంగా కష్టాలు పడుతున్న పేదల కోసం విరాళాలు సేకరించాడు. ముంబయిలో రెస్టారెంట్ నడుపుతున్న పిరితోష్ లాక్‌డౌన్‌లో అనేకమందికి ఉచితంగా భోజనం అందించాడు. మిగతా ఆర్‌సీబీ ఆటగాళ్లు కూడా ట్విటర్ అకౌంట్లలో ఇలాంటి ఫొటోలే పెట్టారు.
Last Updated : Sep 25, 2020, 6:00 PM IST