శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో గెలుపొంది రన్‌రేట్‌ను మరింత మెరుగుపర్చుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఓడిన సీఎస్కే దాదాపు ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా ముంబయి.. చెన్నైపై ఉన్న తన ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసింది. అవేంటో చూద్దాం.
ఈ మ్యాచ్‌లో ముంబయి 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో సీఎస్కేను 10 వికెట్ల తేడాతో ఓడించిన ఒకే ఒక జట్టుగా నిలిచింది. అలాగే ధోనీసేనను 100 పరుగుల లోపే కట్టడి చేసిన ఏకైక జట్టు కూడా ముంబయి కావడం గమనార్హం. 2013లో ముంబయి బౌలర్ల ధాటికి చెన్నై 79 పరుగులకే కుప్పకూలింది.
ముంబయిదే ఆధిపత్యం