తమ ఓపెనర్ షేన్ వాట్సన్‌కు చెన్నై జట్టు కృతజ్ఞతలు తెలిపింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వాట్సన్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ట్వీట్ చేసింది. "థ్యాంక్యూ వాట్సన్. తర్వాతి దశలోనూ నీకు మంచి జరగాలి. ప్రేమతో వీడ్కోలు" అని పేర్కొంది. మరోవైపు లీగ్ నుంచి చెన్నై నిష్క్రమించడం వల్ల ఆటగాళ్లు తిరిగి తమ స్వదేశానికి బయలుదేరారు. ధోనీతో కలిసి వస్తున్నానని స్పిన్నర్ కర్ణ్‌శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
దిల్లీ చేతిలో ఓటమిపాలైనా మెరుగైన రన్‌రేటుతో బెంగళూరు ప్లేఆఫ్‌కు చేరింది. "ఎన్నో రకాల భావోద్వేగాలు. కానీ ఓటమితో ప్లేఆఫ్‌లో అడుగుపెడతామని భావించలేదు. ఏది ఏమైనా టాప్-4లో ఉన్నాం. భయంలేని క్రికెట్ ఆడటానికి అవకాశం లభించింది" అని ఆర్సీబీ ట్వీట్ చేసింది.
స్ఫూర్తిదాయక విజయాలతో పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపర్చుకున్నా.. కీలక మ్యాచ్‌లో తడబడి టోర్నీ నుంచి పంజాబ్ నిష్క్రమించింది. అయితే వచ్చే సీజన్‌లో బలంగా తిరిగొస్తామని ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. "కలిసి గెలిచాం, కలిసి ఓడాం, కలిసి పోరాడాం. అలాగే బలంగా కలిసి తిరిగొస్తాం" అని ట్వీటాడు. మరోవైపు నీషమ్, మాక్స్‌వెల్ ఆత్మీయతతో కౌగిలించుకున్న చిత్రాన్ని పంజాబ్ పోస్ట్ చేస్తూ.. "వీడ్కోలు ఇంత కఠినమా?" అని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ట్వీట్ చేసింది.
ప్లేఆఫ్‌కు చేరని రాజస్థాన్ కూడా ఈ సీజన్ గురించి ట్వీట్ చేసింది. "ఇది ఎంతో సవాలైన సీజన్. కానీ టోర్నీ ఆద్యంతం ఎంతో ఆస్వాదించాం" అని ఆ జట్టు యాజమాన్యం ట్వీట్ చేసింది.