కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సిద్ధమైంది. చెన్నై సూపర్‌కింగ్స్‌తో నేడు (ఆదివారం) జరిగే పోరులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన చెన్నై, ఈ పోరులో విజయం సాధించి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ నాలుగో స్థానానికి చేరుకోవచ్చు. అదే సమయంలో హైదరాబాద్.. తన రెండు మ్యాచ్‌ల్లో ఏదో ఓ దానిలో ఓడిపోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మిగిలిన లీగ్ మ్యాచ్‌ల ఫలితాలపై పంజాబ్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
పంజాబ్‌కు అవకాశాలు ఎక్కువే!
ప్రస్తుతం 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్.. చెన్నైతో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. గేల్ రాకతో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి, రాజస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఓడింది. మళ్లీ ఫామ్‌లోకి వచ్చి, టాప్-4లో నిలవాలని చూస్తోంది.
బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్, గేల్, పూరన్ అదరగొడుతున్నారు. బౌలింగ్ విభాగం నుంచి వీరికి పూర్తి సహకారం అందాల్సి ఉంది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను నిలువరించగలిగితే పంజాబ్‌కు గెలవడం పెద్ద కష్టమేమీ కాదు!