తెలంగాణ

telangana

ETV Bharat / sports

కింగ్స్vsకింగ్స్: సక్సెస్ ట్రాక్ ఎక్కేది ఎవరు? - చెన్నై vs పంజాబ్ లైవ్

దుబాయ్ వేదికగా నేటి (ఆదివారం) రాత్రి 7:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్​ జరగనుంది. గత మ్యాచుల్లో ఓడిన ఇరుజట్లు.. ఇందులో గెలిచి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాయి.

IPL PREVIEW: Dhoni-led CSK seek turnaround in clash against Kings XI Punjab
చెన్నై vs పంజాబ్: ధోనీసేన వరుస ఓటములకు బ్రేక్ పడేనా?

By

Published : Oct 4, 2020, 10:05 AM IST

ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన చెన్నై సూపర్​కింగ్స్.. ఈసారి ఐపీఎల్​లో అంచనాల్ని అందుకోలేకపోతోంది. ధోనీ సారథ్యంలో స్థాయికి తగినట్లు రాణించలేక వరుసగా మూడు మ్యాచ్​ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇది ధోనీ అభిమానుల్ని తీవ్రంగా కలచివేస్తున్న అంశం. పంజాబ్​ జట్టుతో ఆదివారం జరిగే మ్యాచ్​లోనైనా నెగ్గి, గెలుపు ట్రాక్​లోకి రావాలని భావిస్తోంది సీఎస్కే.

చెన్నై సూపర్​కింగ్స్

గతేడాది రన్నరప్​గా నిలిచిన చెన్నై.. ఈసారి ఘోరంగా విఫలమవుతోంది. ఓపెనర్లు వాట్సన్, మురళీ విజయ్​తో పాటు మిడిలార్డర్​లో కేదార్ జాదవ్ నిరాశపరుస్తున్నారు. డుప్లెసిస్​ సహా కెప్టెన్ ధోనీ చాలా కష్టపడుతున్నారు. కానీ ఫలితం లేకుండా పోతోంది. గత మ్యాచ్​తో రాయుడు, బ్రావో.. తిరిగి జట్టులోకి వచ్చినా.. అనుకున్నంతగా ఆడలేకపోయారు. బౌలింగ్​పైనా బాగా దృష్టిపెట్టాల్సి ఉంది.

చెన్నై సూపర్​కింగ్స్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్

కేఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్.. బ్యాటింగ్​లో అదరగొడుతున్నా సరే అదృష్టం కలిసిరావడం లేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్​ల్లో 200 పైచిలుకు స్కోర్లు కొట్టారు. కానీ ఆ మ్యాచ్​ల్లో ఓడిపోయారు. బౌలింగ్​లో షమీ తప్ప మిగిలిన వారు సరైన ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఈ విభాగంలో మెరుగుపడాల్సి ఉంది. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్-మయాంక్ అగర్వాల్, పర్పుల్ క్యాప్-షమీ.. ఈ జట్టు క్రికెటర్ల దగ్గరే ఉండటం విశేషం.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్

జట్లు(అంచనా)

చెన్నై సూపర్​కింగ్స్: వాట్సన్, రాయుడు, డుప్లెసిస్, కేదార్ జాదవ్, ధోనీ, జడేజా, బ్రావో, శార్దుల్ ఠాకుర్, చావ్లా, సామ్ కరన్, దీపక్ చాహర్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, మ్యాక్స్​వెల్, కరుణ్ నాయర్, జేమ్స్ నీషమ్, సర్ఫరాజ్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, షమీ, కాట్రెల్, రవి బిష్ణోయ్

ABOUT THE AUTHOR

...view details