అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టుపై ముంబయి గెలిచింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఓపెనర్ డికాక్(78) గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
కోల్‌కతా జట్టుపై ముంబయి విజయం - MI VS KKR LIVE
22:46 October 16
22:37 October 16
ధనాధన్ బ్యాటింగ్ చేస్తున్న ముంబయి ఇండియన్స్.. విజయానికి చేరువైంది. ప్రస్తుతం 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేశారు. క్రీజులో డికాక్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.
22:09 October 16
ముంబయి ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్ ధనాధనా బ్యాటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం 10 ఓవర్లకు వికెట్లేమి నష్టపోకుండా 90 పరుగులు చేసింది ముంబయి. విజయానికి 10 ఓవర్లలో మరో 59 పరుగులు మాత్రమే కావాలి.
21:45 October 16
149 పరుగుల లక్ష్య ఛేదనను ధాటిగా ప్రారంభించింది ముంబయి. ఓపెనర్లు డికాక్, రోహిత్.. ఎడాపెడా బౌండరీలు బాదుతున్నారు. దీంతో 5 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లేమి నష్టపోకుండా 48 పరుగులు చేసింది.
21:07 October 16
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా బ్యాట్స్‌మెన్ అందరూ తడబడ్డారు. స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులే చేయగలిగింది. బౌలర్ కమిన్స్(53*), కెప్టెన్ మోర్గాన్(39*) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ముంబయి బౌలర్లలో రాహుల్ చాహర్ 2, బుమ్రా, కౌల్టర్‌నైల్, బౌల్ట్ తలో వికెట్ తీశారు.
20:36 October 16
కోల్‌కతా నైట్‌రైడర్స్ చాలా నిదానంగా బ్యాటింగ్ చేస్తోంది. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో మోర్గాన్, కమిన్స్ ఉన్నారు.
20:21 October 16
కోల్‌కతా నెమ్మదిగా ఆడుతోంది. పది ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 57పరుగులు చేసింది. క్రీజులో రసెల్(8), మోర్గాన్(7) ఉన్నారు.
19:57 October 16
మూడో వికెట్ కోల్పోయింది కోల్‌కతా. శుభ్‌మన్ గిల్(21) రాహుల్ చాహర్ బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 7.4 ఓవర్లకు 42 స్కోరు చేసింది కోల్‌కతా.
19:53 October 16
రెండో వికెట్ కోల్పోయింది కోల్‌కతా. నితీశ్ రానా(5) పరుగులే చేశాడు. 5.3 ఓవర్లకు స్కోరు 33గా ఉంది. క్రీజులో శుభమన్ గిల్(17), దినేశ్ కార్తీక్ వచ్చాడు.
19:42 October 16
కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది. బౌల్డ్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి(7) సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మూడు ఓవర్లు ముగిశేసరికి కోల్‌కతా స్కోరు 18గా ఉంది. క్రీజులో శుభమన్ గిల్(7), రాహల్ స్థానంలో నితీశ్ రానా వచ్చాడు.
18:59 October 16
టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కొత్త కెప్టెన్ మోర్గాన్ నేతృత్వంలో బరిలోకి దిగుతోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ముంబయి.. బౌలింగ్ దాడిని ప్రారంభించనుంది.
జట్లు
ముంబయి: రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, పొలార్డ్, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్, బౌల్ట్, కౌల్టర్ నైల్, బుమ్రా
కోల్‌కతా: రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తిక్, రసెల్, క్రిస్ గ్రీన్, కమిన్స్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ
18:34 October 16
కోల్‌కతా కొత్త సారథిగా మోర్గాన్
అబుదాబి వేదికగా ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి ఏడున్నరకు మొదలవుతుంది. అయితే వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొన్న దినేశ్ కార్తిక్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వల్ల ఆ బాధ్యతల్ని ఇయాన్ మోర్గాన్‌కు(ఇంగ్లాండ్) అప్పగించారు. ఈ విషయాన్ని మ్యాచ్‌కు కొన్ని గంటల క్రితమే ఫ్రాంచైజీ వెల్లడించింది.