వరుస ఓటములతో సతమతవుతున్న బెంగళూరు, హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్న హైదరాబాద్.. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచులో తలపడనున్నాయి. ఇందులో గెలిచి ముందడగు వేయాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. మరి ఎవరు విజయం సాధిస్తారో?
మెండుగా గెలిచే అవకాశాలు
లీగ్ తొలి అర్ధభాగంలో వరుస ఓటములను మూటగట్టుకున్నా సరే, చివర్లో గెలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది సన్‌రైజర్స్. కెప్టెన్ వార్నర్, సాహా ఓపెనింగ్ భాగస్వామ్యం అదరగొట్టడమే ఈ విజయాలకు కారణం. మనీశ్ పాండే, విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, జేసన్ హోల్డర్ జట్టుకు బాగా సహకరిస్తున్నారు. బౌలింగ్ విభాగానికి తిరుగే లేదు. పవర్‌ప్లేలో సందీప్ శర్మ, మిడిల్ ఓవర్లలో హోల్డర్, షబాజ్ నదీమ్, రషీద్ ఖాన్.. డెత్ ఓవర్లలో యార్కర్ల స్పెషలిస్ట్ టి.నటరాజన్ తమ అదిరే ప్రదర్శనతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు. మొత్తంగా జట్టు సమష్టి ప్రదర్శన చేస్తోంది. కాబట్టి ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఎలిమినేటర్‌లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది.
మెరుగ్గా ప్రదర్శన చేస్తేనే.. లేదంటే అంతే!
బెంగళూరు జట్టు గత నాలుగు మ్యాచుల్లో ఓడి నిరాశ పరిచింది. అంతకు ముందు గెలిచి ఉండటం వల్ల ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అంచనాలను అందుకోలేకపోతుంది. ఫించ్ స్థానంలో వచ్చిన ఫిలిప్పి దూకుడుగా ఆడలేకపోతున్నాడు. దేవదత్ పడిక్కల్ నిలకడగా ఆడుతూ పర్వాలేదనిపిస్తున్నాడు. కెప్టెన్ కోహ్లీ ప్రదర్శన మెరుగుపడాల్సి ఉంది. డివిలియర్స్ బాగానే ఆడుతున్నాడు. క్రిస్ మోరిస్, శివమ్ దూబె, సుందర్ ఇంకా బాగా ఆడాలి. నవదీప్ సైనీ ఈ మ్యాచ్‌తో తిరిగి బరిలో దిగే అవకాశముంది. స్పిన్ విభాగం బలంగానే ఉంది. మొత్తంగా జట్టులోని ఆటగాళ్లు కలిసికట్టుగా రాణిస్తేనే విజయం వరించి ముందుకు సాగుతారు. లేదంటే కథ మళ్లీ మాములే అవుతుంది.
జట్లు (అంచనా)
హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, జేసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్.
బెంగళూరు: ఫిలిప్పీ, దేవదత్ పడిక్కల్, కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, షహబాజ్ అహ్మద్, క్రిస్ మోరిస్, ఇసురు ఉదానా, సిరాజ్, చాహల్
ఇదీ చూడండి:ప్లేఆఫ్స్‌లో మరింత సరదాగా ఉంటుంది: కోహ్లీ